కరోనా గందరగోళ పరిస్థితిలో సుప్రీం కోర్టు సామాజిక మాద్యమాలకు సంభందించి కీలక ఆదేశాలు జారి చేసింది. సామాజిక మాద్యమాల్లో వచ్చే కరోనాకు సంభందించిన సమస్యలు, వినతులపై చర్యలు తీసుకోరాదని అట్లా తీసుకుంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రజలు తమ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటే, ఆ సమాచారాన్ని తొక్కిపెట్టాలని తాము కోరుకోవడం లేదని కరోనా పరిస్థితిపై విచారించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు.
ఆక్సిజన్ సరఫరా అత్యవసరాల ఔషధాల పంపిణి, వాక్సినేషన్ తదితర అంశాలపై సుప్రీం కోర్టు సుమోటాగా తీసుకుని ఏప్రిల్ 22 నుండి న్యాయ విచారణ జరుపుతోంది. వ్యాక్సిన్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలన్నారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ప్రైవేటు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సహాయపడటం చాలా ముఖ్యమని అన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలను ప్రస్తావిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు వేర్వేరు ధరలు ఎందుకు నిర్ణయించారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నూటికి నూరు శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు ఉండటంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించింది. వైద్యులు, ఆరోగ్య సేవల కార్యకర్తలకు సైతం ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వెలిబుచ్చింది. సాధారణ పౌరుడిగా, న్యాయమూర్తిగా ఇది చాలా ఆందోళన కరమైన పరిస్థితి అని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి పేదలు, అణగారిన వర్గాల వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీసింది. ఇటువంటి ప్రైవేటు రంగ విధానం ఉండకూడదని పేర్కొంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనం అమలు చేస్తున్న జాతీయ రోగ నిరోధక విధానాన్ని అమలు చేయడం తప్పనిసరి అని పేర్కొంది.
లాక్‌డౌన్ తరహా ఆంక్షలు, చర్యల గురించి వివరించాలని కోరింది. నిరక్షరాస్యులు వ్యాక్సినేషన్ కోసం ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని, వారికి ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? అని ప్రశ్నించింది. శ్మశాన వాటికల సిబ్బందికి వ్యాక్సినేషన్ చేస్తున్నారా? పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92ను అమలు చేస్తున్నారా? అత్యవసర పరిస్థితుల్లో లైసెన్సుల జారీ విధానం ఏమిటి? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box