తూర్పు రష్యాలోని బ్లాగోవేషెన్క్స్ పట్టణంలో జరిగిన సంఘటన
ఆసుపత్రి ఓ వైపు తగల బడుతుంటే మరో వైపు వైద్యులు ఓ పేషెంట్ కు ఓపెన్ హార్ట్ సర్జరి చేశారు. ఏప్రిల్ 2 న రష్యాలో జరిగిందీ నమ్మశక్యం కాని సంఘటన. తూర్పు రష్యాలోని బ్లాగోవేషెన్క్స్ పట్టణంలో బహుళ అంతస్తుల ఆసుపత్రి భవణంలో హఠాత్తుగా అగ్ని ప్రమాదం జరిగి పై అంతస్తులో మంచలు చెల రేగాయి. ఓ వైపు దట్టమైన పొగలు ఆవరించి ఆసుపత్రి ఆవరణంతా గందరగోళంలో ఉంది. ఫైర్ ఇంజన్లు వచ్చి ఓ వైపు మంటలు ఆర్పే పనిలో ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ పేషెంట్ కు ఓపెన్ హార్ట్ సర్జరి జరుగుతోంది. పేషెంట్ హార్ట్ ఓపెన్ చేసిన సమయంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. దాంతో వైద్యులు ఆపరేషన్ నిలిపి వేయకుండా అందు బాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మంటలు, పొగ ఆపరేషన్ దియేటర్ లోకి రాకుండా నిలువరించారు. ధియేటర్ లో ఎమెర్జెన్సి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేసుకుని సర్జి పూర్తి చేశారు. ఈ సర్జరీలో 8 మంది వైద్యులకు నర్సులు, అటెండెంట్స్ సహాయ పడ్డారు.
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిందనే విషయం తెల్సి అప్రమత్తం అయ్యామని అప్పటికే సర్జరి మొదలు కావడంతో పేషెంట్ ను వదిలి వేస్తే ప్రాణాపాయం తప్పదని గ్రహించి పూర్తి జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ విజయ వంతం చేశామని ఆసుపత్రి చీఫ్ సర్జన్ వాలెంటిన్ ఫిలటావ్ మీడియాకు వెల్లడించారు. వైద్యులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలు లభించాయి.
ఈ ఆసుపత్రి భవణం చాలా పురాతన మైనది. 1907 సంవత్సరంలో నిర్మించారు. పై అంతస్తులో ఎక్కువశాతం కలపను అపుయోగించారు. దాంతో ఆగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వ్యాపించాయి. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరిని సురక్షితంగా బయిటికి తీసుకు వచ్చారు. ఆస్తి నష్టం జరిగిందని ప్రాణ నష్టం జరగవద్దని భావించి ఎంతో శ్రమించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box