రెండు వందల సంవత్సరాల చరిత్రగల బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ 'ద గార్డియన్ ' దిన పత్రిక నరేంద్ర మోడీని ఉతికి ఆరేసింది.
రెండవ విడత కరోనా విజృంభణకు మోడీనే కారణమని కుండబద్దలు కొట్టింది.
ఆయన ఉత్తర కుమారుడి ప్రగల్భాలను ఎత్తి చూపించింది.
పాలనా వైపల్యాలను నిర్మొహమాటంగా కళ్ళకట్టెదుట నిలబెట్టింది.
గత శుక్రవారం 'ద గార్డియన్' దిన పత్రికలో వచ్చిన వార్తకు స్వేచ్ఛానువాదం చదవండి
- రాఘవ శర్మ
వ్యాఖ్యానాలకు స్వేచ్ఛ ఉంది.. కానీ వాస్తవాలు పవిత్రమైనవి - సీపీ స్కాట్ ( ద గార్డియన్ తొలి సంపాదకుడు)
మోడీ అబద్దాల అతి విశ్వాసంతో కరోన విజృంభన
ప్రధాని మోడీ అబద్దాల అతివిశ్వాసంతోనే భారతదేశంలో కరోనా విజృంభించింది.
దేశం 'కోవిడ్-19 క్రీడ ' ముగింపు దశలో ఉందని నరేంద్రమోడీ హిందూత్వ ప్రభుత్వం గత మార్చి చివర్నే ప్రకటించింది.
కానీ, భారతదేశం ఇప్పుడు నరకాన్ని చవిచూస్తోంది.
బి.1.617 అనే ఈ రెండవ దశ కరోనా వైరస్ విధ్వంసకర పాత్రను పోషిస్తోంది.
ఆసుప్రతుల్లో పడకలు ఖాళీలేవు.
తగినన్ని ఆక్సీజన్ సిలిండర్లు లేవు.
శ్మశానాల్లో ఖాళీ లేదు.
శవాలు కుళ్ళిపోతున్నాయి.
శవాలను వీధులలోనే వదిలేయాల్సి వస్తుందని స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఒక్క శుక్రవారమే (23) భారత దేశంలో రికార్డు స్థాయిలో 3 లక్షల 32 వేల,730 మందికి కొత్త గా కరోనా (సార్స్ కోవిడ్-2) సోకింది.
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు రెండవ రోజు కూడా భారత దేశంలోనే బైటపడ్డాయి.
గడచిన 24 గంటలలో (23 శుక్రవారం నాటికి) 2,200 మంది మృత్యువాత పడ్డారు.
చాలా దేశాలు భారత దేశానికి విమాన సేవలను రద్దు చేశాయి.
భారత దేశానికి వెళ్ళవద్దని చాలా దేశాలు తమ పౌరులను హెచ్చరించాయి.
భారత దేశం నుంచి తిరిగి వచ్చినట్టయితే ఏకాంతంలో(క్వారంటైన్)లో ఉండమని కోరుతున్నాయి.
ఆరు నెలల క్రితం నూటికి ఒక్కరికి కూడా వాక్సిన్ వేయడం పూర్తి కాక ముందే, భారత దేశం ' ప్రపంచ ఔషదాలయం' అని మోడీ ప్రకటించి పులకించిపోయారు.
అంతటితో ఆగకుండా, కోరానా రావడానికి ముందు ఉన్న జీవితాన్ని పునరుద్దరించినట్టు కూడా చెప్పారు.
వందలాది మందితో క్రికెట్ స్టేడియాలు కిక్కిరిసి పోయాయి.
కుంభమేళాలో లక్షలాది మంది హిందూ భక్తులు సమూహికంగా గంగానదిలో మునిగారు.
వీటి వల్ల కరోనా విపరీతంగా వ్యాప్తి చెందింది.
కరోనా ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ట్రంప్‌లానే మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఏప్రిల్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మాస్క్ లేకుండానే మోడీ పాల్గొన్నారు.
మోడీకున్న అసాధారణ ప్రజాకర్షణ ఆయనకు ఆత్మసంతృప్తినిచ్చింది.మ
జాతిపట్ల నిబద్దత లేకపోవడం వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వాక్సిన్ ఉత్పత్తికి సంసిద్ధం కాలేదు.
ప్రపంచానికి వాక్సిన్ అందించడంలో భారత దేశం ఒక ఇరుసులా పనిచేస్తుందని భావించి పశ్చిమ దేశాలు ప్రోత్సహించాయి.
ఇదొక పొరపాటు అయిఉందచ్చని జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్ ఈవారం సూచించారు.
కరోనా వాక్సిన్‌ను భారతదేశం కంటే చైనా, అమెరికాలే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.
వాక్సిన్ ముడిసరుకు ఎగుమతులపై ఉన్న అమెరికా ఆంక్షలను సడలించాలని భారత్ కోరుతోంది.
విధిలేక రష్యానుంచి వాక్సిన్‌ను దిగుమతి చేసుకోక తప్పడం లేదు.
భారత ప్రధాని మోడీ తన సహజ స్వభావరీత్యా, తానొక గొప్ప నిపుణుడినన్న అతి తెలివితేటల ఆత్మవిశ్వాసంతో బాధపడుతున్నారు.
మాజీ ప్రధాని కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరడానికి సిద్ధమవుతున్న వేళ ఆయనకు శ్రీరంగ నీతులు చెప్పడానికి మోడీ మంత్రివర్గ సహచరులు సిద్ధమయ్యారు.
గత ఏడాది ఉన్నట్టుండి కోట్లాదిమంది ప్రజలపైన మోడీ కౄరమైన లాక్‌డౌన్ విధించారు.
అంటు వ్యాధుల నిపుణుల సలహాలను తీసుకోకుండా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఇలా తన సహజసిద్ధమైన నాటకీయ చర్యలకు పాల్పడ్డారు.
మొదటి దశలో కరోనా పట్టణాలకు పాకింది.
ఇప్పడు దేశ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు కూడా పాకింది.
చాలా దేశాలలానే భారతదేశంపైన కూడా కరోనా విరుచుకుపడింది.
మరణాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, అసమర్ధ , అహంభావపూరిత ప్రభుత్వం వల్ల అది సాధ్యం కాలేదు.
సంక్లిష్టమైన , వైవిధ్యభరితమైన భారత దేశాన్ని పాలించడం అంత తేలిక కాదు.
ఇది చాలా పెద్ద దేశం.
ఈ స్థితిలో తనకు తాను జాతీయ అత్యవసర పరిస్థితి విధించుకోక తప్పదు.
కరోనా వైరస్‌తో, భయంతో భారత దేశం భయపడిపోతోంది.
భయాన్ని పారదోలడం కోసం మాస్కును ధరించి, భౌతికదూరం పాటించ మని భారతీయులకు ఇప్పడు ఒక భరోసా కల్పించాలి.
కరోనా నుంచి బైటపడే బాధ్యతను మోడీ రాష్ట్ర ప్రభుత్వాలపైన నెట్టేశారు.
కానీ బాధ్యత నిజానికి అతని చేతులలోనే ఉంది.
అంతులేని ఈ విషాదానికి కారణమైన తన పొరపాట్లను మోడీ గుర్తించి, సరిచేసుకోవాలి.
వీటి నుంచి ఎలా బైటపడాలో నిపుణులతో చర్చించాలి.
తాను చేసిన హామీలను నిలబెట్టుకుంటానని ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాలి.
సమైక్యత అవసరమైన చోట ప్రజలను విభజించే ఒంటెత్తు పోకడల ధోరణిని విడనాడాలి.
మోడీ తన అసాధారణ ఆలోచనలను ఇలా మొండిగా కొనసాగిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తే రేపటి చరిత్రకారులు తగిన తీర్పులు చెబుతారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box