ఆస్ట్రేలియా కొత్త చట్టం - మీడియా సంస్థలకు ప్రయోజనం

 గూగుల్- ఫేస్ బుక్ వార్తలు షేర్ చేస్తే మీడియా సంస్థలకు డబ్బులు చెల్లించాలి
ఆస్ట్రేలియా పార్లమెంట్ లో చట్టం 



ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన అనంతరం క్షణాల్లో వార్తలు  ప్రపంచానికి చేరుతున్నాయి. ఇందులో  గూగుల్, ఫేస్ బుక్ వంటి ప్లాట్ ఫాం ల పై వార్తల ప్రపంచం వర్దిల్లుతోంది.  వార్తలతో మీడియా సంస్థకు ఒన గూరే ప్రయోజనాల కన్నా గూగుల్, ఫేస్ బుక్ తదితర ఇతర సామాజిక మీడియా సంస్థలకే అధిక ప్రయోజనాలు ఒన గూరుతున్నాయి. గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలలో మీడియా అంశాలు లేక పోతే వాటికి అంతగా ఆదరణ ఉంటదు.  ట్విట్టర్, ఇన్స్ స్టాగ్రామ్, లేటెస్టుగా వచ్చిన ఇతర మాద్యమాలన్ని ఇతర అంశాల కన్నా ఆయా  మీడియా సంస్థల వార్తలను షేర్ చేయడం ద్వారా  ప్రాచుర్యం పొందాయి.

మీడియా సంస్థలకు లబ్ది చేకూరే క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు వచ్చింది. ఫేసు బుక్, గూగుల్, ట్విట్టర్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్ ఫాం లు ఏవైనా మీడియాీ సంస్థల వార్తలు వాడుకుంటే వాటికి నిర్ణీత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం అస్ట్రేలియా ప్రభుత్వం ఓ కీలక బిల్లు తీసుకు వచ్చింది. దీనికి పార్లమెంట్ ఆమోద ముద్ర కూడ వేసింది.  ఆస్ట్రేలియా పార్లమెంట్ లో ఏకగ్రీవంగా ఈ మేరకు బిల్లు ఆమోదిస్తూ తీర్మాణం చేశారు. 

ఈ ప్రతిపాదనను మొదట్లో ఫేస్ బుక్ వ్యతిరేకించింది. ఆస్ట్రేలియా లో వార్తలు షేర్ చేసే వెసులు బాటును బాన్ చేసింది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని సూచించిన మేరకు ఆస్ట్రేలియా ప్రభుథ్వం అంగీకరించింది.  దాంతో కొత్త చట్టం ఆమోదించారు. ఇక నుండి గూగుల్ కాని లేదా ఫేస్ బుక్ కాని వార్తలు షేర్ చేస్తే మీడియా సంస్థలతో కొంత డబ్బు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీడియా సంస్థలకు ఆర్థిక పరమైన ప్రయోజనాలు నెరవేరుతాయి. 

డిజిటల్ ప్లాట్ ఫాం లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మీడియా సంస్థలు బాగా నష్ట పోయాయి. అప్ డేట్ చేసిన వార్తలను డిజిటల్ ప్లాట్ ఫాం లు  క్షణాల్లో ప్రపంచానికి చేర వేసినా మీడియా సంస్థల ఆర్థిక ప్రయోజనాలు బాగా దెబ్బతిన్నాయి. గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు వ్యాపార ప్రకటనలతో  బాగా లబ్ది పొందుతున్నాయి.

ఆస్ట్రేలియా లో తీసుకు వచ్చిన చట్టాలు ఇతర దేసాలలో కూడ అమలు చేస్తే మీడియా సంస్థలు కొంత వరకు గట్టెక్కుతాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భారతీయ వార్తా పత్రికలకు డబ్బులు చెల్లించాలి

లేఖ రాసిన  భారతీయ వార్తా పత్రికల సొసైటీ

వార్తలను (సమాచారాన్ని) సెర్చ్‌ఇంజిన్‌లో ఉపయోగించుకున్నందుకు భారతీయ వార్తా పత్రికలకు డబ్బులు చెల్లించాలని భారతీయ వార్తా పత్రికల సొసైటీ (ఐఎన్‌ఎస్‌) గురువారం గూగుల్‌ను కోరింది. ప్రకటనల ఆదాయంలో ప్రచురణకర్త వాటాను 85 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.ఆదిమూలం గూగుల్‌కు ఓ లేఖ రాశారు. గూగుల్‌ ప్రకటన విలువకు సంబంధించి సమగ్ర వివరాలు పొందలేకపోతున్నందున ప్రచురణకర్తలకు పారదర్శక ప్రకటనల వ్యవస్థ అందుబాటులో లేకుండా పోతోందన్నారు.  ‘‘ప్రకటనల ఆదాయంలో ప్రచురణకర్తల వాటాను 85 శాతానికి పెంచాల్సిందిగా సంఘం తరఫున గూగుల్‌కు స్పష్టం చేస్తున్నాం. అలాగే ప్రచురణకర్తలకు అందజేసే ఆదాయ నివేదికల్లో మరింత పారదర్శకత ఉండాలని కోరుతున్నాం’’ అని ఐఎన్‌ఎస్‌ పేర్కొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు