హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గానికి టిఆర్ఎస్ ఎమ్మెల్సి అభ్యర్థిగా వాణీదేవి
ఎమ్మెల్సి ఎన్నికల్లో అనూహ్యంగ హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజి ప్రధాన మంత్రి పి.వి నరసింహా రావు కూతురు సురభి వాణీదేవి పేరును ఖరారు చేశారు. ఇన్నిరోజులు టిఆర్ఎస్ పార్టి అభ్యర్థి విషయంలో కసరత్తు చేయలేదు. ఈ స్థానం నుండి వామపక్షాల అభ్యర్థిగా మాజి ఎమ్మెల్సి నాగేశ్వర్ రావు పోటీలో ఉన్నారు. టిఆర్ఎస్ పార్టి అభ్యర్థిని ఖరారు చేయక పోవడంతో నాగేశ్వర్ రావుకు మద్దతు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అందరు అనుకున్నట్లు నాగేశ్వర్ రావుకు మద్దకు ఇవ్వకుండా మాజి ప్రధాన మంత్రి పి.వి.నరసింహరావు కూతురు సురభి వాణీదేవి తెరపైకి తేవడం ఇతర రాజకీయ పార్టీలకు ఒక రకంగా ఊహించని విషయమే.
వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గెలుపు ఓటములపై టిఆర్ఎస్ పార్టి కసరత్తు చేసిందా లేదా తెలియదు కాని పి.వి. నరసింహారావు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తు తెలంగాణ బిడ్డగా ఆయనకు సముచిత గౌరవం కల్పించిన కెసిఆర్ ఎమ్మెల్సి ఎన్నికల్లో ఆయన కూతురును బరిలో దించడం ద్వారా ఎవరూ ఊహించని విదంగా నిర్ణయం తీసుకున్నారు.
పి.వి. తదనంతరం ఆయన కుటుంబ సబ్యులు ఇంతవరకు ఎక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేయ లేదు. పి.వి జీవితం అంతా కాంగ్రేస్ పార్టీతోనే ముడిపడి కాంగ్రేస్ పార్టీ తోనే ముగిసినా ఆయన తదనంతరం ప్రత్యక్ష ఎన్నికల్లో ఎవరికి అవకాశం కల్పించలేదు. పి.వి.
ఆయన కుమారుడు పి.వి రంగారావును గతంలోప్రధాన మంత్రి మన్ మోహన్ సింగ్ పి.వి నరసింహారావు పై ఉన్న అభిమానంతో ఎమ్మెల్సిగా నియమించారు. ఆయన తన 75 ఏట 2013 లో చనిపోయారు. పి.వి కుమారుల్లో ఒకరైన పి.వి. రాజేశ్వర్ రావు 1996 లో జరిగిన మద్యంతరం ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి బండారు దత్తాత్రేయ పై పోటి చేసి గెలిచారు. పి.వి. రాజేశ్వర్ రావు తన తండ్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో హన్మకొండ అసెంబ్లి నియోజక వర్గం నుండి ఎంపికై విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు.
పి.వి నరసింహా రావు ప్రధాన మంత్రి పదవి కాలం ముగిసిన అనంతరం పి.పి.కుటుంబ సబ్యులను కాంగ్రేస్ పార్టి పట్టించు కోలేదని విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టి ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గానికి కాంగ్రేస్ పార్టి తమ అభ్యర్థిని ప్రకటించింది. మాజీమంత్రి చిన్నారెడ్డి కాంగ్రేస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. బిజెపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్సి ఎన్ రామచంద్రరావు మూడో సారి పోటీలో నిలిచారు.
టిఆర్ఎస్ పార్టి పి.వి కూతురును పోటీలో నిలపడం కాంగ్రేస్ పార్టీకి ఒక రకంగా షాక్ అని చెప్పవచ్చు. కాంగ్రేస్ పార్టి విస్మరించిన పి.వి.కుటుంబ సబ్యులను ఆదరించి ఆ క్రెడిట్ దక్కించుకునేలా టిఆర్ఎస్ ప్లాన్ చేసింది. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రేస్ పార్టీని టార్గెట్ చేస్తూ వాణీదేవి ని పోటీలో దించడం సంభ్రమాశ్చర్యం అయినా ఆమె గెలుపుకు ఎంత వరకు తోడ్పడుతుందో ఎలాంటి ఎత్తులు వేస్తుందో కాంగ్రేస్ పార్టీ సానుభూతు ఓట్లు పడతాయా అనేది చూడాలి. వాణీదేవి ని గెలిిపంచుకోక పోతే ఓడి పోయే సీటులో ఆమెను పోటీకి నిల బెట్టారన్న అపవాదు టిఆర్ఎస్ పార్టీకి మిగులు తుంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box