తండ్రి బాటలో షర్మిల ..నోటివెంట తెలంగాణ నినాదం

 


రాజకీయ అవసరాల కోసం నేతలు ఎంతటి నాటకాల కైనా సిద్దపడతారు. అధికారం లోకి వచ్చే వరకు ఓ మాట వచ్చిన తర్వాత ఓ మాట మాట్లాడతారు.  గతంలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడ ఇదే చేశారు. ఇప్పుడు ఆయన  వారసురాలు వై.ఎస్ షర్మిల కూడ అదే చేస్తున్నారు. వై.ఎస్ తెలంగాణ రాష్ట్రం విషయంలో అధికారంలో లేనపుడు  ఉద్యమానికి సపోర్ట్ చేసి అధికారం లోకి వచ్చిన తర్వాత  ఉద్యమాన్నే కబలించే  రాజకీయ కుట్రకు పాల్పడ్డాడు. టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 2004 లో అధికారంలోకి వచ్చిన తర్వాత వై.ఎస్   ఏకంగా టిఆర్ఎస్ పార్టి ఎమ్మేల్యేలను ప్రలోభాలకు గురి చేసి  కాంగ్రేస్ పార్టీ లో కలిపేసుకున్నారు.  టిఆర్ఎస్ సపోర్ట్ లేకుండా ఉంటే వై.ఎస్ తన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కాని ఆయన సిఎం అయినంక తెలంగాణకు వ్యతిరేకంగా చేయని కుట్రలు లేవు. 2009 ఎన్నికల ప్రచారంలో తాను తెలంగాణా కు అడ్డం కాదంటూనే తెలంగాణ బార్డర్ దాటిన వెంటనే హైదరాబాద్ కు వెళ్లాలంటే పాస్ పోర్ట్ తీసుకోవాలా అంటూ ఆంధ్రలో సెంటి మెంట్ రెచ్చగొట్టాడు. 

సరే ఆయన 2009 లో చిరంజీవి  ప్రజా రాజ్యం పార్టి ఓట్లు చీల్చడం వల్ల రెండో సారి అధికారం లోకి రాగలిగాడు.  ప్రజా రాజ్యం లేకుంటే కాంగ్రేస్ పార్టీ పరిస్థితి వై.ఎస్ పరిస్థితి మరో రకంగా ఉండేది. నయానా.. బయానా  మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని మింగేయాలని చూసిన వ్యక్తి వై.ఎస్. ఆయన బతికి ఉంటే తెలంగాణ విషయం అంత సులుగా తేలేది కాదు. సమైక్య వాదిగా మాజి ఫాక్షనిస్టుగా తీవ్రంగా వ్యతిరేకించే వాడు. మలి దశలో తాడో పేడో తేల్చుకోవాలనుకున్న  తెలంగాణ జనం  కూడ వై.ఎస్ వంటి వ్యతిరేకులను ఎదుర్కునేందుకు ఏ త్యాగాలకు  అయినా వెనుకాడేవారు కాదు.  ఉద్యమం అనేక మలుపులు తిరిగేది. ఇదంతా గత చరిత్ర.

 ఇక వర్తమానం లోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆరు సంవత్సరాల గాప్ తర్వాత  వై.ఎస్. షర్మిల తన తండ్రి లాగే తెలంగాణ లో ఉన్న పరిస్థితులను  ఏం అధ్యయనం చేశారో ఏం వడ బోసి కొత్తగా ఏం తెల్సుకున్నారో కాని టిఆర్ ఎస్ పై అసంతృప్తితో ఉన్నారని  రాజన్న రాజ్యం తెస్తానంటూ బయలు దేరారు. రోజుకో జిల్లా వారితో  సంప్రదింపులు జరుపుతున్నారు. తెలంగాణ లో తనపై వ్యతిరేకత రాకూడదని చివరికి నోటి వెంట జై తెలంగాణ నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడామె నోట కొత్తగా జై తెలంగాణ జై వైఎస్ ఆర్ నినాదాలు మొదలయ్యాయి. ఇక ఈ నినాదాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మాయలో పడేయాలనే కొత్త నాటకానికి షర్మిల తెర లేపారు. లోటస్ పాండ్ లో  శనివారం  రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వారితో జరిగిన సంప్రదింపుల సమావేశంలో షర్మిల ఈ నినాదాలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో నోటి వెంట రాని జై తెలంగాణ నినాదాలు ఇప్పడు రావడాన్ని తెలంగాణ ప్రజలు అర్దం చేసుకోలేని వారేం కాదు.

త్యాగాలకు పోరాటాలకు పురిటి గడ్డ అయిన తెలంగాణ లో సీమాంధ్రుల పెత్తనాన్ని తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులలో  అంగీకరించబోరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు