ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్ద చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా?..చర్చకు రమ్మని అడగడానికి ఓ స్థాయి ఉండాలె అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తి విషయంపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విడుదల చేసిన పత్రం పై ప్రతిపక్షాల విమర్శలు వెల్లు వెత్తాయి. లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తి చేశామని టిఆర్ఎస్ ప్రచారం చేస్తుండగా అంతా అబద్దమని నిరూపిస్తామని దమ్ముంటే చర్చలకు రావాలని కాంగ్రేస్ పార్టి జాతీయ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కెటిఆర్ కు సవాల్ విసిరి గన్ పార్క్ వద్ద బైటాయించారు.
ఇదే విషయంపై మంత్రి తల సాని శ్రినివాస్యాదవ్ శనివారం నగరంలో జరిగిన ఎమ్మెల్సి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఎవరు పడితే వారు చర్చలకు రావాలని పిలిస్తే కెటిఆర్ వస్తారా అంటూ ప్రశ్నించారు. సవాల్ చేసే వారికి ఓ స్థాయి ఉండాలన్నారు. కెటీఆర్ పై వ్యాఖ్యలు చేసేవాళ్లు తమ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని
అన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తి విషయంలో విఫలం అయ్యాయని టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఉద్యోగాలు భర్తి అయ్యాయని అన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box