భాజపా దీది సర్కార్ ను ఓడ గొడుతుందా ? ప్రశాంత్ కిశోర్ ఏం చెప్పాడు ?

 


పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆస్క్తి నెలకొంది. మమతా దీది పరిస్థితి ఎంటనేది సర్వత్రా చర్చ నీయాంశంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న  భాజపా పశ్చిమ బెంగాల్ లో  మమతా ను ఓడించి అధికారం లోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అమిత్ షా తన దిన చర్యలో ఎక్కువ సమయం పశ్చిమ బెంగాల్ కు కేటాయించారు.  

పశ్చిమ బెంగాల్  లో వామపక్షాల కంచుకోటను దీది బద్దలు కొట్టారు.  ఇప్పటికి రెండు అసెంబ్లి ఎన్నికల్లో గెలిచిన దీది 2011 నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆమె ఈ ఎన్నికల్లో తన అధికారం నిలుపు కోగలిగితే ముచ్చటగా మూడో సారి గెలిచి హాట్రిక్ సాధించి నట్లు అవుతుంది. 

కాని బాజపా అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వ రాదని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీదీ ని గద్దె దించి ఒకప్పటి ఎర్ర కోటలో కాశాయ జెండా ఎగుర వేయాలని భాజపా తహ తహ లాడుతోంది. అయితే బాజపా ఎత్తుగడలకు ధీటుగా మమతా బెనర్జి పై ఎత్తుుల వేస్తూ తన అధికార్ పదిల పర్చుకునే పనిలో తల మునకలైంది. 

దీది పశ్చిమ బెంగాల్ లో  బాజపాకు అడ్డు కట్టలు వేసి అదధికారం నిలుపు కోగలిగితే దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించ వచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జి నాయకత్వంలోని త్రుణమూల్ కాంగ్రేస్ పార్టి గెలిస్తే  దేశ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. అందుకే బాజపా మమతాను ఓడ గొట్టాలని కంకణం కట్టుకుని ఏ అవకాశాన్ని వదలడం లేదు.

పేరు మోసిన ఎన్నికల వ్యూహ కర్త ఒకప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్  పశ్చిమ బెంగాల్ లో మమతాకు ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా వ్యవహరిస్తున్నారు.  ఆయన ఎప్పటి నుంచో పశ్చిమ బెంగాల్ లో తిరిగిత్రుణ మూల్ కాంగ్రేస్ పార్టీయే అధికారంలో ఉంటుందని మమతా బనెర్జీయే ముఖ్యమంత్రిగా ఉండ బోతున్నారంటూ చెబుతు వస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు దేశంలో కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యాయని ఎన్ని వేళలా  ఎప్పుడు ఆయన వ్యూహాలు  ఫలించ బోవంటూ బాజపా కొట్టిపారేస్తొంది.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్‌‌కు చెందిన ఐ-ప్యాక్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపద్యంలో " ప్రజాస్వామ్యం కోసం చేసే యుద్ధాల్లో ఓ కీలక సమరం పశ్చిమ బెంగాల్‌‌లో జరగబోతోంది. అందుకు బెంగాల్ ప్రజలు రెడీగా ఉన్నారు. సరైన వారిని ఎంచుకునేందుకు, తమ సందేశాన్ని పంపేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు. బెంగాల్‌ తమ సొంత కూతురిని మాత్రమే కోరుకుంటోంది. మే 2వ తేదీ వరకు ఈ ట్వీట్‌‌ను గుర్తుంచుకోండి  " అంటూ పీకే పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న యుద్ధమని చెప్పిన ప్రశాంత్ కిషోర్.. బెంగాల్ తమ సొంత కూతురినే కోరుకుంటోందని, ఇతరులను కాదన్న తృణమూల్ నినాదాన్ని ట్వీట్ చేశారు.

చూడాలి మరి ప్రశాంత్ కిశోర్ వ్యూహం పశ్చిమ బెంగాల్ లో ఎంత మేరకు ఫలిస్తుందో దీది అధికారం నిలుపు కుంటుందా లేక కమలం గుబాలిస్తుందా అనేది ఎన్నికల ఫలి తాలు వెలువడే వరకు ఓ ఉత్కంఠగా ఎదురు చూడక తప్పదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు