జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరించేందుకు కృషి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామి


 

పెండింగ్ లో ఉన్న కాకతీయ జర్నలిస్టుల కోఆపరేటివ్ హౌజింగ్  సొసైటి ఇండ్ల స్థలాల విషయం పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామి ఇచ్చారు.


జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అన్యాక్రాతంపై సీనియర్ జర్నలిస్టులు మండువ రవీందర్ రావు, కూన మహేందర్,అచ్చుత రఘునాథ్ ,బి.దయాసాగర్,   జర్నలిస్టు హౌజింగ్ కోఆపరేటివ్ సొసైటి ఉపాధ్యక్షులు ప్రసాద్, రమేశ్ బాబు, కంజర్ల నర్సింహరాములు,వహీద్ గుల్షన్, సోమర్సయ్య, నార్లగిరి యాదగిరి, వేణుమాధవ్, పూర్ణ చందర్ తదితరులు శనివారం మంత్రిని కల్సి సమస్య వివరించారు.

 జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం 2009 లో దర్గా కాజిపేట మండలం లో సర్వే నెంబర్ 27 లో   రాష్ట్ర ప్రభుత్వం  మంత్రివర్గం ఆమోదంతో 4.20 ఎకరాలు సొసైటీకి కేటాయించిందని తెలిపారు.


జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో కొందరు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ నిభందనలకు విరుద్దంగా ఇతరులకు అక్రమంగా ఇండ్ల స్థలాలు కేటాయించడంతో  చాలా వరకు అన్యాక్రాంతం జరిగిందని జర్నలిస్టులు మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.  చీఫ్ కమీషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) లో  జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు సంభందించిన సమస్య త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని జర్నలిస్టులు కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. చీఫ్ సెక్రెటరి సోమేశ్ కుమార్ తో మంత్రి దయాకర్ రావు ఫోన్లో మాట్లాడి జర్నలిస్టుల సమస్యకు సంభందించి సమస్యను వివరించారు. సిసిఎల్ ఏ లో పెండింగ్ లో ఉన్న అంశాన్ని పరిష్కరించాలని కోరారు.  

తెలంగాణ రాష్ట్ర సాదన కోసం జర్నలిస్టులు చేసిన పోరాటం మరిచి పోలేమని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో అమలు అవుతున్నాయని అన్నారు. జర్నలిస్టుల  సంక్షేమం కోసం  సిఎం కెసిఆర్ 100 కోట్ల బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు.

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హన్మంతు తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. జర్నలిస్టుుల సమస్య సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. 

అనంతరం జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ రాజీవ్ హన్మంతును కల్సి ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలలో అక్రమ కట్టడాలు వెలిసాయని ఫిర్యాదు చేసారు. కొందరు రెవెన్యూ ఉద్యోగులు నిభందనలకు విరుద్దంగా ఇష్టాను సారంగా  అక్రమంగా షెడ్లు వేశారని 27 సర్వే నెంబర్ లో మొత్తం భూమి సర్వే చేయించి ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు