రాహుల్ గాంధి మష్రూమ్ భిర్యాని భలే మజా లే !

 


రాజకీయాల సంగతి ఎలా ఉన్నా  కాంగ్రేస్ పార్టి ఉపాద్యక్షుడు ఇందిరమ్మ వారసుడు రాహుల్ గాంధి వంటల్లో మాత్రం బాగా రాణించేటట్లు ఉన్నారట. ఈ మాట ఎవరో రాజకీయ పక్షాల నేతలు అన్నవి కావు.  యువ నేతకు ప్రపంచం వ్యాప్తంగా నెటిజెన్లు ఇచ్చిన కితాబు. అవును మరి రాహుల్ గాంధి ఈ మద్య వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. గుమ గుమ లాడే  మష్రూమ్  భిర్యాని స్వయంగా వండి వడ్డించుకుని తిన్నాడు.ఎక్కడో కాదు తమిళ నాడు రాష్ట్రంలో గత వారం అసెంబ్లి ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళిన రాహుల్ గాంధి అక్కడి రాష్ట్రంలో బాగా ఫేమస్ అయిన విలేజి కుకింగ్ ఛానెల్ టీం సబ్యులతో కల్సి మష్రూమ్ భిర్యాని వండారు. ఇప్పుడా వీడియో నెట్టింట బాగా వైరెల్ అయింది. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన నిమిషాల్లో లక్షల వ్యూస్ వచ్చాయి. రాహుల్ గాంధి భిర్యాని వంటకం చూసి ఆయన తింటూ ఉంటే  మీరూ చూసి అనంద పడండి. తమిళ నాడు రాష్ట్రంలో విలేజి కుకింగ్  ఛానెల్ బాగా పాపులర్ అయిన యూటూబ్ వంటల ఛానెల్. గ్రామీణ వాతావరణంలో ఈ టీం సబ్యులు వంటలు చేసి అందరి నోరూరిస్తారు. 
అంతేకాదు అనాధలకు వంటలు చేసి అన్నదాణం చేస్తారు.

కాంగ్రేస్ పార్టి నాయకులను ఒప్పించి రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీని జనవరి 29 వ తేదీన  తమ ఛానెల్ లో అతిధిగా ఆహ్వానించారు. ఆయన చేత బిర్యానికి కావల్సిన మసాలాలు స్వయంగా కలిపించారు. వనక్కం అంటూ టీం సబ్యులతో కల్సిపోయారు. తమిళలంలో పేర్లు తెల్సుకుంటూ వాటిని ఉచ్చరించారు. ఉల్లి గడ్డలను తమిళంలో వెంగాయం అంటూ పెరుగును తాయీరు అంటూ కల్లు ఉప్పును తమిళంలో పేర్లు పెట్టి పిలుస్తూ రాహుల్ గాంధి విలేజ్ కుకింగ్ ఛానెల్ టీం తో బాగా ఎంజాయ్ చేశారు.  మష్రూమ్ పుట్టగొడుగులతో తయారు చేసిన భిర్యానీని అరటి ఆకులో వడ్డించగా టీం సబ్యులతో కల్సి సహపంక్తి భోజనం చేశారు. 14 నిమిషాల నిడివి గల వీడియో ఇప్పుడు నెట్ లో బాగా వైరల్ అయింది. 

విలేజ్ కుకింగ్ ఛానెల్ సబ్యులతో కల్సి రాహుల్ గాంధి ఈ సందర్భంగా చాలాసేపు ముచ్చటించారు. వారి ఛానెల్ గురించి తెల్సుకున్నారు. దేశంలో ఇతర ప్రాంతాలలో కూడ ప్రోగ్రాం లు చేయాలని సూచించారు. విదేశాలలో ప్రోగ్రాములు చేయాలని ఉందని టీం సబ్యులు తమ కోరిక వెల్లబుచ్చగా అందుకు సహకరిస్తానని అమెరికాలో తన మిత్రుడు ఉన్నాడని అతనితో మాట్లాడి అక్కడికి వెళ్ళేందుకు ఏర్పాటు చేస్తానని రాహుల్ గాంధి వారికి హామి ఇచ్చారు. రాహుల్ గాంధి తమతో గడపడం తమ అదృష్ట మని టీం సబ్యులు బాగా సంతోష పడ్డారు.

రాహుల్ గాంధి  వెంట కరూర్ పార్లమెంట్ నియోజక వర్గం సబ్యురాలు కాంగ్రేస్ పార్టి నేత జ్యోతి మణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు