టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత పెండ్లి మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో శనివారం రాత్రి 9.45 కు శంషాబాద్ లోని అమ్మపల్లి శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో వైభవంగా జరిగింది. భందు మిత్రులు, ప్రముఖ రాజకీయ వేత్తలు, సినిమా ఇండస్ట్రి సెలబ్రేటీలు పలువురు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
అమ్మపల్లి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణాన్ని పెండ్లి మండపంగా అందంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర పంచాయితి రాజ్ శాఖ మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు తో సహా పలువురు అతి కొద్ది మంది సెలబ్రెటీలు హాజరై సునీత దంపతులను ఆశీర్వదించారు. ఇటీవలే వివాహం జరుపుకున్న హీరో నితిన్ తన సతీమణితో సహా హాజరయ్యారు.
డిసెంబర్ 26 రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్లో సునీత మెహంది ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకలకు చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు.
సునీత వివాహం సినిమా ఇండస్ట్రీ లోపలా బయటా చాలా కాలంగా హాట్ టాపిక్ అయింది. గతంలో వివాహం జరిగి కుమారుడు, కూతురు ఉన్న సునీత మొదటి భర్తతో గతంలో విడి పోయింది.
హీరో నితిన్ దంపతులను అభినందించిన మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ ప్రాంత హీరో నితిన్ షాలిని దంపతులను మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. సునీత పెండ్లికి ఈ నూతన దంపతులు హాజరు అయ్యారు. గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో హోటెల్ తాజ్ ఫలక్ నుమాలో అతి కొద్ది మంది సెలెబ్రెటీల సమక్షంలో నితిన్ వివాహం జరిగింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box