అమెరికాలో కలకలం రేపిన మహాత్ముడి విగ్రహ విధ్వంసం

 

ఖలిస్తానీ వేర్పాటు వాదుల పనేని గాంధి అభిమానుల మండి పాటు
తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ 


అమెరికాలో మహాత్మగాంధి విగ్రహ ధ్వంసం కల కలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మిా గాంధి విగ్రహం  ధ్వంసంచేయడం పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో  జనవరి 27 ఉదయం డేవిస్‌ నగరంలోని ఓ పార్కులో ఏర్పాటు చేసిన ఆరడుగుల మహాత్మాగాంధీ కంచు విగ్రహాన్ని   గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.  విగ్రహం  పాదాలు విరగ్గొట్టి  తల భాగం కట్ చేసి మాయం చేసారు.  తెల్లవారు జామున పార్కు ఉద్యోగి ఒకరు గాంధీ విగ్రహం విధ్వంసాన్ని గుర్తించి, పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. డేవిస్‌ నగర మేయర్‌ ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

భారత ప్రభుత్వం నాలుగేళ్ళ క్రిందట ఈ విగ్గహాన్ని బహూకరించింది. ఈ విగ్రహం ఏర్పాటు సమయంలో  మైనార్టీల హక్కుల కోసం పనిచేస్తున్న ఓ స్వచ్చంద సంస్థ అడ్డుపడింది.  అయితే ఓటింగ్ నిర్వహించి మెజార్టి అభిప్రాయం మేరకు అక్టోబర్ 2, 2016 న మహాత్ముడి జయంతి రోజు విగ్రహం ప్రతిష్టించారు. అయితే ఖలిస్తాని వేర్పాటు వాదులు లేకవారి మద్దతు దారులు ఈ పనికి ఒడిగట్టి ఉంటారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తన మహాత్ముడి వర్దంతి నిర్వహించిన సమయంలో ఈ విధ్వంసానికి పాల్పడం వెనక కుట్ర కోణం ఉందని ఆరోపణలు వచ్చాయి.  కాలిఫోర్నియాలోని ఖలిస్తాని అనుకూల సంస్త ఒకటి ఈ విగ్రహం విధ్వంసాన్ని స్వాగతిస్తు ట్వీట్ చేయడం  మహాత్ముడి అభిమానులకు ఆగ్రహం కలిగించింది. విగ్రహ విధ్వంసకులను గుర్తించి శిక్షించాలని ఎన్ఆర్ ఐలు కాలిఫోర్నియా మేయర్ కు విజ్ఞప్తి చేశారు.  

విగ్రహం విధ్వంసా్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని డిప్యూటి చీఫ్ పాల్ దోర్షవ్ మీడియాకు చెప్పారు. నిందితులు ఎవరనేది ఇంకా నిర్దారణ కాలేదన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు