అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ భారత కాల మానం ప్రకారం బుధవారం రాత్రి 10.20 గంటలకు ప్రమాణం చేశారు. భారత సంతతికి చెందిన అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేశారు. సుదీర్ఘ కాలంగా రాజకీయ పదవులు నిర్వహించిన 78 ఏళ్ల బైడెన్ ఇప్పటి వరకు అధ్యక్ష పదివిని చేపట్టిన వారిలో కన్న అత్యధిక వయోధికుడు. ఇది అమెరికా దేశ చరిత్రలోనే ఓ రికార్డు.
కేపిటల్ భవనంపై దాడి కారణంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా 25,000 మంది నేషనల్ గార్డ్స్‌తో వాషింగ్టన్‌లో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఆఖరికి భద్రతాసిబ్బందిలో ఎవరైనా ట్రంప్-అనుకూలురు దాడి చేస్తారేమోనన్న భయం కూడా ఉండడంతో సీక్రెట్ సర్వీస్, ఆర్మీ ఏ ఛాన్సూ తీసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.
ఈ కార్యక్రమానికి క్లింటన్, జార్జ్‌బుష్, ఒబామా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ట్రంప్ బుధవారం ఉదయమే వైట్ హౌజ్ ను వీడారు. లేడీ గాగా జాతీయ గీతాలాపానతో కార్యక్రమం మొదలయ్యింది. ఆ తర్వాత బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ప్రసంగించారు. అనంతరం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box