జావా సముద్రంలో కుప్పకూలిన ఇండోనేషియా విమానం - 62 మంది ప్రయాణీకుల గల్లంతు

ప్రయాణికులను తీసుకుని ఎగిరిన నాలుగు నిమిషాలకే ఇండోనేషియాకు చెందిన విమానం అదృశ్యమైన  జకార్తా నుంచి పాంటియానక్‌ వెళ్తున్న బోయింగ్‌-737 శ్రీవిజయ విమానం టేకాఫ్‌ తీసుకున్న కొన్ని నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయి  సముద్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. 
ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకర్నో హట్టా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొన్ని నిమిషాలకే అదృశ్యమవడం కలకలం రేపింది. సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోెంది.
ప్రయాణికుల్లో  ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు.


జకార్తా: ఇండోనేషియాకు చెందిన ఎయిర్‌ బోయింగ్‌-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. జావా సముద్రంలో పడిపోయినట్లు గుర్తించారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత విమానం సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా విమాన శకలాలు కనపించడంతో  విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.  ప్రయాణికుల్లో  ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 

56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 62 మంది ప్రయాణిస్తున్న ప్యాసింజర్ జెట్ ఇండోనేషియా రాజధాని నుంచి బయలుదేరిన తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు కోల్పోయాయని అధికారులు తెలిపారు. రాడార్ డేటాబాక్స్ ప్రకారం మధ్యాహ్నం 1.56 గంటలకు జకార్తా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కంట్రోల్ టవర్‌తో పరిచయం కోల్పోయిందని ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదితా ఇరావతి తెలిపారు. ఈ ఘటనపై నేషనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ కమిటీ  దర్యాప్తు  మొదలుపెట్టిందన్నారు.  మరోవైపు జకార్తా సమీపంలోని తంగేరాంగ్‌లోని సూకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక  సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 ఇండోనేషియా దేశంలో విమానయాలకు విషాద చరిత్ర ఉంది. 2018 అక్టోబర్‌ 29న ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 189 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో కూడా చాలా ప్రమాదాలు సంభవించాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు