లాఠి చార్జి చేసి భాష్ప వాయి గోళాలు ప్రయోగించి వాటర్ కానన్స్ తో శీతల జల ప్రయోగం చేసినా బెదరని రైతులు
సిఎం సభా వేదిక వద్ద రచ్చ రచ్చ చేసిన రైతులు
సభకు హాజరు కాకుండానే రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు గా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కెమ్లా గ్రామంలో కిసాన్ మహా పంచాయత్ పేరిట సభను నిర్వహించేందుకు సిద్దపడ్డారు. ముఖ్యమంత్రి సభకు హాజరు కావల్సి ఉండగా ఆయన రాక ముందే రైతులు సభా స్థిలికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ విషయం ముందే గ్రహించిన పోలీసులు భారి సంఖ్యలో మోహరించారు. ఆందోళన జరుపుతున్న రైతులను కెమ్లా గ్రామం లోకి అడుగు పెట్టకుండా ఆపడం పోలీసులకు సాధ్యం కాలేదు. చివరికి పోలీసులు లాఠి చార్జి చేసి భాష్ప వాయిగోళాలు కూడ ప్రయోగించారు. వాటర్ కానన్స్ తో శీతల జలాన్ని ప్రయోగించారు. అయినా రైతులు వెనక్కి తగ్గుకండా పోలీసుల వలయాన్ని ఛేదించుకుని సభా వేదిక వద్దకు దూసుకు వచ్చారు. సభ వేదిక చుట్టు ఉన్నబారికేడ్లను ధ్వంసం చేశారు. వేదిక ప్రాంగణంలో ఉన్న కుర్చీలను ఎత్తి పడేసి విసిరేసారు. వేదిక ఎక్కి రైతు చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రైతుల ఆందోళన సమాచారం తెల్సిన ముఖ్యమంత్రి కిసాన్ మహా పంచాయత్ ను రద్దు చేసుకున్నారు.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ‘కిసాన్ మహా పంచాయత్’ సభకు నిరసన సెగ తగిలింది. రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గిన ఆయన తన సభను రద్దు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించేందుకు నేడు కెమ్లా గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box