చిట్ ఫండ్ కంపెనీల మోసాలకు అంతు లేకుండా పోయింది. చిట్ ఫండ్ కంపెనీల పేరిట సబ్యుల తో చిట్టీలు వేయించి నానా ఇబ్బందులు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తు చిట్టీలు ఎత్తుకున్న వారికి డబ్బులు సకాలంలో ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. చిట్టీలు వేయించుకుని మోసం చేసిన కేసులో పోలీసులు ఓ చింట్ ఫండ్ కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
అక్షర చిట్ ఫండ్ యజమాని శ్రీనివాస రావుపై సుబేదారి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసారు. జనగామకు చెందిన ఇద్దరు దంపతులు అక్షర చిట్ ఫండ్ వరంగల్, మహబూబాబాద్, జనగామ బ్రాంచీలలో పలు చిట్టీలు వేశారు. ఎత్తుకున్న చిట్టీలకు డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తు ఇబ్బందులు పెడుతున్నాడని చేసిన ఫిర్యాదు మేరకు ఐపిసి 420,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. చిట్ ఫండ్ పై చిట్స్ డిప్యూటి రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేసినా ఏ చర్యలు తీసుకోలేదని అధికారులు పట్టించు కోక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని ఫిర్యాదు దారుల తరపు న్యాయ వాది పి.సత్యప్రకాశ్ తెలిపారు.
ఎత్తుకున్న చిట్టీలకు భూములు కుదువ పెట్టుకుని డబ్బులు ఇవ్వలేదని చిట్టీలకు సంభందించిన డివిడెండ్స్ కూడ ఇవ్వలేదని అట్లాగే అనమతులు లేకుండా సభ్యుల చిట్టీలు తొలగించారని చిట్ పండ్ నిభందనలు పాటించకుండా అనేక అవకతవకలకు పాల్పడ్డారని సుమారు 2.50 కోట్ల వరకు చిట్ ఫండ్ కంపెనీ చెల్లించాల్సి ఉందని తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box