జనగామలో బిజెపి శ్రేణుల ర్యాలి - ఉద్రిక్తత-సిఐని సస్పెండ్ చేయాలన్న బండి బండి సంజయ్
విచారణకు ఆదేశించిన కమీషనర్
బిజెపి నాయకులపై పోలీసుల దాడిని నిరసిస్తూ జనగామలో బుధవారం భారతీయ జనతా పార్టి శ్రేణులు కదం తొక్కాయి. పార్టి చీఫ్ బండి సంజయ్ పిలుపు మేరకు బిజెపి నాయకులు, కార్యకర్తలు జనగామకు చేరుకుని ర్యాలి నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి నాయకులను బండి సంజయ్ పరామర్శించారు. బిజెపి ర్యాలి సందర్బంగా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బిజెపి కార్యకర్తలు ఎసిపి కార్యాలయం గేటు ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డు కున్నారు. కొద్ది సేపు పోలీసులకు కార్యకర్తలకు మద్యతోపు లాట జరిగింది.
సిఐని సస్పెండ్ చేయక పోతే ఆందోళన తీవ్రం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. అధికారి పార్టి ఫ్లెక్సీలు ఉంచి బిజెపి వారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ కమీషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. భాజపా నాయకులపై దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని అన్నారు. సిఎం కెసిఆర్ ఫాం హౌవుజ్ నుండి బయటకి వచ్చి భాద్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకుంటే తమపార్టి ఏం చేస్తుందో చెప్పకుండా చేసి చూపిస్తామని అన్నారు. సిఎం ఫాం హవుజ్ పై దాడి చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఫ్రెండ్లి పోలీస్ లేదని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొన సాగుతోందని విమర్శించారు. శాంతి యుతంగ నిరసన తెలుపుతున్న బిజెపి నాయకులపై పోలీసులు ఎట్లా దాడి చేసి కొట్టారో దేశం అంతా చూసిందని అన్నారు.
ర్యాలీలో బిజెపి ప్రదానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, గైనేని రాజన్, జనగాన జిల్లా అధ్యక్షులు దష్మంత్ రెడ్డి,డాక్టర్ విజయ రామారావు తదితరులు పాల్గొన్నారు.
విచారణకు ఆదేశించిన కమీషనర్
జనగామలో భాజపా నాయకులపై జరిగిన పోలీసుల ాలటి చార్జీపై విచారణకు ఆదేశిస్తూ పోలీస్ కమీషనర్ పి ప్రమోద్ కుమార్ ఆదేశాలు జారి చేసారు. వెస్ట్ జోన్ డిసిపిని విచారణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారి చేసారు. విచారణలో పోలీసుుల భాద్యులని తేలితే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమీషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box