కట్టు బొట్టు మార్చి హైందవ సాంప్రదాయంలో గోమాతకు పూజలు చేసిన జగన్

 కట్టు బొట్టు మార్చి హైందవ సాంప్రదాయంలో గోమాతకు పూజలు చేసిన జగన్ 


ఎపిలో ఆలయాల్లో గత కొద్ది రోజులుగా విగ్రహ విధ్వంసాలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. అధి కార ప్రతిపక్ష పార్టీలు ఈ గందరగోళంలో ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్న నేపద్యంలో రాష్ట్ర ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకున్నారో కాని ఎపి సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టు బొట్టు మార్చారు. అన్య మత విశ్వాసం కలిగిన జగన్ మోహన్ రెడ్డి  హైందవ వేశధారణతో కనిపించి గోమాతకు పూజలు చేసారు.   కనుమ పండగ సందర్భంగా రాష్ర్టంలో గోపూజ నిర్వహించడం ఆనవాయితా కాగా ఈ సారి స్వయంగా జగన్ మోహన్ రెడ్డి గోపూజలో పాల్గొన్నారు. పట్టు వవస్త్రాలంకరణలో  వేద పండితుల మంత్రోశ్చరణల మద్య హారతి పట్టి  గోమాతకు పూజలు నిర్వహించారు. నరసరావుపేట మున్సిపల్  స్టేడియంలో  సిఎం జగన్ మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా గోపూజ కార్యక్రమం ఏర్పాటు  చేసారు. స్టేడియంలో ప్రత్యేకంగా స్టాల్స్ కూడ ఏర్పాటు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,679 ఆలయాల్లో టిటిడి అధ్వర్యంలో ఈ గో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు.   మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు గోపూజలో జగన్మోహన్ రెడ్డి వెంట పాల్గొన్నారు.



సిఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో లేని విదంగా ఈ సారి గోపూజలో పాల్గొనడం పట్ల ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు హైందవ భక్తులను ప్రసన్నం చేసుకునేందుకేనా అంటూ ప్రశ్నలు సందించారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ లో ఈ మేరకు సెటైర్ వేసారు.  సీఎం గారూ... సంక్రాంతికి గోపూజ చేసి రాష్ట్రంలోని హైందవ భక్తులకు సంతోషం కలిగించారు అంటూ ట్వీట్ చేశారు. సీఎం చర్య ఆనందదాయకం అని పేర్కొన్నారు. "మరి, గత సంక్రాంతికి మీరు ఇంటికే పరిమితం అయ్యారు. గోపూజ చేయలేదు... ఎందుకని?" అని ప్రశ్నించారు. "ఈ ఏడాది దేవాలయాల మీద దాడులే మీ గోపూజకు కారణమా? లేక, ఇకపై ప్రతి ఏడాది చేస్తారా? పీకే దయ, మా ప్రాప్తం" అంటూ ట్వీట్ చేసారు.

2019 ఎన్నికలకు ముందు వేద పండితుల సమక్షంలో నదీ స్నానాలు ఆచరించిన ఫోటోలు సోషల్ మీడియాలో కావాలనే  విడుదల చేశారో లేక లీక్ చేశారో కాని ఈ ఫోటోలు చూసి పెద్ద చర్చే జరిగింది. ఆప్పట్లో జగన్ తన మతం మార్చుకుని  హిందు మతంలోకి మారారాని చర్చ జరిగింది. అయితే జగన్ ఎక్కడా అధికారికంగా తాను హిందూ మతంలోకి మారినట్లు ప్రకటించ లేదు. ఆయన సిఎం అయిన తర్వాత హిందు ఆలయాల్లో  హైందవ సాంప్రదాయాల మేరకు జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు.  

రాజకీయ నేతలు వ్యక్తిగతంగా ఏ మత విశ్వాసం కలిగిన వారైనా ఓట్ల కోసం సర్వ మత ప్రార్ధనలు చేస్తారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు చేసారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి అదే పాటిస్తున్నారు. అంతా ఓటరు మహాశయుని కోసం అన్నమాట. ఎపిలో ఓ వైపు తెలుగుదేసం పార్టి మరో వైపు భారతీయ జనతా పార్టి  రెండూ  హిందూ మత విశ్వాసలకు  జగన్ ను వ్యతిరేకిగా చిత్రించే యత్నాలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు