ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.ఎల్ ఆర్ ఎస్,బిఆర్ఎస్ పై బుధవారం విచారణ జరిగిన సందర్భంగా సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆ పథకాలకు సంబంధించి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం 2016లో బీఆర్‌ఎస్ పథకం తీసుకొచ్చింది. ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు స్వీకరించింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 2016లో తీసుకొచ్చిన బీఆర్‌ఎస్ పథకంపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నంటిపై బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఎల్‌ఆర్‌ఎస్ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగుతోందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని ఏజీ వివరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైకోర్టుకు, పిటిషనర్లకు సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి ధర్మాసనం ఏజీని ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box