అవమాన కర రీతిలో ట్రంప్ కు వీడ్కోలు - అభిశంసన ఆమోదించిన సబ్యులు

 


అగ్ర రాజ్యాద్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తన ఓటమిని అంగీక రించకుండా తిక్క తిక్కగా చేసి అమెరికా పరువు తీసారు. జో బైడెన్ గెలుపును నిర్దారించేందుకు సమావేశం జరుగుతున్న కాపిటల్ భవనంపై ట్రంప్ తన మద్దతు దారులను ఉసి గొల్పాడు. ఈ ఘటన సందర్బగా పోలీసులు జరిపిన కాల్పులలో  నలుగురు నిరసన కారులు ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. గౌరవంగా మాజి అధ్యక్షులను సాగనంపే తంతుకు బదులు ఈ ఘటనతో ట్రంప్ ను  మెడ పట్టి గెంటినంతగా చేసారు. 

 ట్రంప్ కావాలనే తన మద్దతుదారులను దాడికి ప్రోత్సహించారంటూ  ఈ ఘటన అనంతరం ట్రంప్ పై చర్యలకు ఉపక్రమించారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మెజారిటీ సభ్యులు మద్దతు పలకడంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ఈ తీర్మానాన్ని సెనేట్‌కు పంపనున్నారు. రెండు సార్లు అభిశంసనకు గురైన రికార్డు ట్రంప్ స్వంతం చేసుకున్నారు. కాగా, ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. 

ట్రంప్ నిర్వాకంపై అమెరికా సీరియస్ గా ఉంది. ఆయన్ని తేలికగా వదిలి పెట్టే పరిస్థితులు లేవు.. దేశ ప్రతిష్టకు భంగం కలిగే రీతిలో వ్యవహరించిన ట్రంప్ పై జో బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం విచారణ మొదల వుతుందని అమెరికా మీడియా వార్తలు వెల్లడించాయి. అదే జరిగితే  ట్రంప్ చేసిన తప్పులకు ఏ శిక్ష విధిస్తారో లేక దయ తలిచి మందలింపులతో వదిలేస్తారో చూడాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు