అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓటమి చెందినా రాజకీయ నిష్క్రమణ ఇప్పుడప్పుడే ఉండబోదని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఓటమి జీర్మించుకోలేక పోతున్న ట్రంప్ తిరిగి 2024 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటి చేబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. వైట్ హోజ్ లో క్రిస్ మస్ పార్టి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. నాలుగు సంవత్సరాల పదవికాలంలో రోజులు బాగా గడిచాయి..మరో నాలుగు ఏళ్ళు ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాను గెలుపు కోసం చాలా శ్రమించాను..కాని దురదృష్టవ శాత్తు ఓడిపోయానని ట్రంప్ అన్నారు. తిరిగి నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం ఖాయమంటూ ట్రంప్ సందేశం ఇచ్చారు.
ఇప్పటికి ట్రంప్ ఇంకా తన ఓటమి విషయంలో నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నట్లు ఆయన మాటల్లోనే అర్దం అవుతోంది. తాజాగా ట్రంప్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ట్విట్టర్ లో విడుదల చేసాడు. ఈ వీడియోలో ఎన్నికల వ్యవస్థపై విమర్శలు చేశాడు. ఎన్నికల వ్యవస్థ పై దాడి జరిగిందని చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికలలో జరిగిన మోసాలకు అవకతవకలకు సంభందించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎన్నికలలో తాను ఓడి పోవడం అనేది అసాధ్యమంటూ అందులో పేర్కొన్నారు.
ఎన్నికలలో అవకతవలకలు జరిగాయని ఆరోపిస్తూ ట్రంప్ న్యాయ స్థానాలను గకూడ ఆశ్రయించాడు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ట్రంప్ చేసిన ఆరోపణలి నిరాధారమని న్యాయ స్థానాలు తేల్చాయి.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box