లూయి ఆదర్శ అంధుల పాఠశాలలో వరంగల్ ఎన్ఆర్ఐ శ్రీధర్ నీల పుట్టిన రోజు వేడుకలు

  •  ఆటో నగర్,కొత్తవాడలో గల లూయి ఆదర్శ అంధుల పాఠశాలలో 
    వరంగల్ ఎన్.ఎర్.ఐ ఫోరం లండన్ యు.కె అధ్యక్షులు శ్రీధర్ నీలపుట్టిన రోజు వేడుకలు

  • దూర తీరాలలో ఉన్నా పుట్టిన గడ్డపై నిర్విరామంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన వంతు మానవతను పంచున్న శ్రీధర్ నీల
  • ఆనాధలకు..అన్నార్తులకు అప్తుడుగా అందరికి తోడ్పాటుగా నిలవాలని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీధర్ నీల



వరంగల్ ఎన్.ఎర్.ఐ ఫోరం లండన్ యు.కె అధ్యక్షులు శ్రీధర్ నీల భర్త్ డే సందర్భంగా బుధవారం వరంగల్ నగరంలో ఆటోనగర్ లోని లూయి ఆదర్శ అంధుల పాఠశాలలో విద్యార్థులు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా శ్రీధర్ నీల  విద్యార్థులకు పౌష్టికరమైన భోజన సదుపాయం కల్పించారు. తాను దూరంగా ఉన్న తన మనస్సు వరంగల్ వాసులతో నే ఉందని అన్నారు. అంధుల పాఠశాల విద్యార్థులు వారి పాఠశాలలో కేక్ కట్ చేసి తన పుట్టిన రోజు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

శ్రీధర్ నీలకు వరంగల్ వాసులతో పాటు లండన్,యుకె ఎన్ఆర్ఐ లు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.


     

                       లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిర పడిన శ్రీధర్ నీల వరంగల్ వాసి కావడంతో ఆయన తన స్వంత జిల్లాపై మమకారంతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లూయి ఆదర్శ అంధుల పాఠశాలకు పై అంతస్తు తరగతి గది నిర్మాణం కోసం వరంగల్ ఎన్.ఎర్.ఐ ఫోరం లండన్ యు.కె పక్షాన లక్ష 25 వేల రూపాయల  సహాయం చేసారు. 

కరోనా కష్టకాలంలో మారుమూలన ఉండే ఆదివాసి గిరిజనులకు నిత్యావ సరాలు అంద చేసారు. వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు  వాహనాల ఏర్పాటుకు తోడ్పాటుగా నిలిచారు. వరంగల్ లో కాన్సర్  పేషెంట్ చికిత్స కోసం ఆర్థిక సాయం చేసారు. అతని పిల్లలకు స్కూలు ఫీజులు చెల్లించి ఆదుకున్నారు. వెంకటాపురం మండలంలోని పాత్రపురం గ్రామంలో  ఆదివాసి మహిళ నిర్వహిస్తున్న వృద్ధ అనాధాశ్రమం కోసం రూ 25 వేల అర్థిక సహాయం చేసారు.

లండన్ లో ఉంటున్న  వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులు వరంగల్ ఎన్.ఎర్.ఐ ఫోరం లండన్ యు.కె పేరిట ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేసుకున్నారు. లండన్ లో ఉండే వరంగల్ వాసులకు తోడు వరంగల్ జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు  ప్రతి నెల తమ వేతనంలో కొంత కేటాయించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీధర్ నీల తెలిపారు. 

తమ ఫోరం పౌండర్ కిరణ్ పసునూరి, ఉపాద్యక్షులు భాస్కర్ పిట్టల,జయంత్ వద్దిరాజు, రమణ సాదినేని, వంశి మునిగంటి, నాగ ప్రశాంతి, మాడి శెట్టి భాస్కర్ తో పాటు ఇతర ఎన్ఆర్ఐల ఈ సహాయ సహకారాలతో వరంగల్ జిల్లా ప్రజలతో మమేకం అయి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని  శ్రీధర్ నీల  వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు