మమతా బెనర్జీ..అసదుద్దీన్ ఓవైసి మద్య మాటల యుద్దం
హైదరాబాద్ కేంద్రంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నేత అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ఆ పార్టి క్రమంగా దేశంలో విస్తరిస్తోంది. పార్టి పూర్తిగా ముస్లీం మత మైనార్టీల ఓట్లు చీలుస్తూ మరో వైపు హిందుత్వ పార్టీగా తనకు తాను ముద్ర వేసుకున్న భారతీయ జనతా పార్టీకి తోడ్పడుతూ ఇతర పక్షాలను దెబ్బతీస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మజ్లీస్ పార్టి పశ్చిమ బెంగాల్ లో కాలు మోపింది. దాంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి త్రుణమూల్ కాంగ్రేస్ పార్టి అధ్యక్షురాలు మమతా బెనర్జి మద్య మాటల వార్ మొదలైంది. పార్టీని క్రమంగా విస్తరిస్తున్న మజ్లీస్ పార్టి ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచు కుంది. పశ్చిమ బెంగాల్ లో జరగ బోయే అసెంబ్లి ఎన్నికల్లో పోటీకి సిద్దపడింది. ఈ నేపద్యంలో మమతా బెనర్జీకి ఓవైసీకి మద్య మాటల యుద్దం మొదలైంది. ముస్లీం ఓట్లు చీల్చేందుకే ఓవైసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పోటికి సిద్ద పడ్డాడని మమతా బెనర్జి ఆరోపణ. ముస్లీం లను చీల్చడానికి భారతీయ జనతా పార్టి కోట్లాది రాపాయలు కుమ్మరించి హైదరాబాద్ నుండి ఓ పార్టీని తీసుకు వచ్చిందంటూ మమతా బెనర్జి విమర్శించారు.
మమతా బెనర్జి విమర్శలకు అసదుద్దీన్ ఓవైసికూడ గాటుగా స్పందించారు. "నన్ను కొనే మనిషి ఇంతవరకు పుట్టలేదు. ఆమె(మమతా బెనర్జీ) ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ఆమె చాలా ఆందోళనలో ఉన్నారు. ఆమె పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారు. సొంత రాష్ట్రంలోనే ఆమె భయపడుతున్నారు. బీహార్ ఓటర్లును, మాకు ఓటు వేసిన ప్రజలను ఆమె అవమానించారు. గతంలో పార్టీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఓటు కట్టర్లు అని ఆరోపిస్తే.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో గుర్తు పెట్టుకొండి. ముస్లిం ఓట్లు ఏమైనా మీ జాగీరా" అంటూ ఒవైసీ ప్రతి విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు..
మజ్లీస్ పార్టి క్రమంగా దేశమంతా విస్తరిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో 2017 ఎన్నికల్లో పోటి చేసిన మజ్లీస్ పార్టి ఒక్క సీటు కూడ గెలవలేక పోయింది. మహారాష్ర్టలో 2 సీట్లు గెలుచుకోగా ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో మజ్లీస్ పోటీకి దిగుతోంది. పశ్చిమ బెంగాల్ లో మజ్లీస్ పార్టి పోటి వల్ల త్రుణమూల్ పార్టీకి నష్టం జరిగి బిజెపి లాభ పడుతుంది. అందుకే మమతా బెనర్జి మద్సీల్ పార్టీని టార్గెట్ చేసింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box