రాహుల్ గాంధీ రైతు ఫోటో ట్వీట్ చేస్తే... రైతు నిజాయితీనే శంకిస్తారా?
ప్రాణాలు కూడ లెక్క చేయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల భాదలు గాధలు మీడియాలో వస్తున్నవి స్వల్పమే అయినా వచ్చిన వార్తలకు కూడ అధికార బిజెపి నేతలు వక్ర భాష్యం చెబుతున్నారు. రైతుల ఆందోళనపై కూడ బురద జల్లు తున్నారు.
రైతును ఓ పోలీస్ లాఠీతో కొడుతున్న దృష్యానికి సంభందించిన ఫోటోను కాంగ్రేస్ నేత రాహుల్ గాంధి ట్వీట్ చేయడంతో ఆ ఫోటో బాగా వైరల్ అయింది.
ఇది చాలా భాదాకరమైన ఫోటో. జై జవాన్ జై కిసాన్ అనేది మన నినాదం. కాని ఈ రోజు ప్రధాని అహంకారం ఓ జవానును రైతుకు వ్యతిరేకంగా నిల బెట్టిందని ఇది చాలా ప్రమాదకరమని రాహుల్ గాంధి ట్వీట్ చేసారు.
ఈ ఫోటోను కాంగ్రేస్ పార్టి జనరల్ సెక్రేటరి ప్రియాంక గాంధి కూడ షేర్ చేసి రైతులపై జరిగిన లాఠి చార్జిని తప్పు పట్టారు. దాంతో బిజెపి ఐటి సెల్ హెడ్ అమిత్ మాల్వియా స్పందిస్తు రాజీవ్ గాంధి ఈ దేశంలో అత్యంత అపఖ్యాతి పొందిన నాయకుడంటూ విమర్శలు చేసాడు. రైతును కనీసం పోలీసు ముట్టుకోను అయినా ముట్టు కోలేదని రాహుల్ గాంధిని తప్పు పడుతూ రీ ట్వీట్ చేసాడు. ఓ వీడియో క్లిప్పింగ్ కూడ దానికి జత చేశాడు. ఆయితే ఇందులో పోలీసు ఆ రైతు పరుగెత్తు తుండగా లాఠి బలంగా విసిరిన దృష్యం ఉంది. ఆ లాఠి రైతును తాకి నట్లే వీడియోలో కనిపించింది. కాని బిజెపి నేత మాత్రం రైతులను పోలీసులు కొట్టనే లేదని తప్పుడు వాదనలు చేసాడని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
ఈ వివాదం ఇట్లా కొన సాగుతుంటే ఓ జాతీయ మీడియా అసలు నిజాలు ఏంటో తెల్సుకునే ప్రయత్నం చేసింది. అసలు రైతు కూడ తనను పోలీసు కొట్టాడని మీడియా ముందుకు వచ్చి నన్ను పోలీసులు కొట్టింది నిజమేనంటూ .. నేను పోలీసు చేతిలో దెబ్బలు తిన్నానంటూ ఒంటిపై గాయాలు చూపించి మరీ రుజువు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న ఆ రైతు తన దెబ్బల గుర్తులు చూపించి సాక్ష్యం చెప్పాల్సి రావడం చాలా భాదాకరం.
పంజాబ్ లోని కపుర్తలా నుండి వచ్చిన రైతు సుఖదేవ్ సింగ్ (65) వాస్తవాలు వివరిస్తు సింఘు వద్ద ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు కొట్టారని తెలిపారు. ఒంటిపై గాయాలు అయ్యాయని చేయి మీద లాఠి చార్జి దెబ్బ కు కమిలిని గాయం కూడ అయిందని చెప్పాడు. పోలీసులు వాటర్ కానన్ లు ప్రయోగించారని భాష్ప వాయి గోళాలు కూడ ప్రయోగించారని అ తర్వాత లాఠి చార్జి చేసారని వివరించాడు. ఇంకా సుఖదేవ్ సింగ్ అక్కడే రైతులతో కల్సి ఆందోళన కొనసాగిస్తున్నాడు.
రైతులు రాజకీయ ఆందోళనలు చేయడం లేదు. నిజాయితీగా తమ డిమాండ్లను నెర వేర్చుకునేందుకు ప్రజాస్వామ్య పద్దతులలో నిరసన తెలియ చేస్తున్నారు. ఆలాంటి రైతుల నిజాయితీని శంకించడం బిజెపి నాయకులకు తగదు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box