ఢిల్లీలో జర్నలిస్టును దోచుకున్నదొంగల అరెస్ట్

 


దేశ రాజధాని ఢిల్లీలో ఓ జర్నలిస్టును దారి కాచి దోచుకున్న కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టే చేసారు. డిసెంబర్ 21 వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో ఎఎన్ఐ జర్నలిస్టు జాయ్ పిళ్లై విధులు ముగించుకుని  ల‌క్ష్మీన‌గ‌ర్ ఏరియాలో ని తన ఇంటికి వెళుతుండగా ముగ్గురు గుర్తు తెలియని దొంగలు  దారి కాచి పిస్టల్, కత్తి గురి పెట్టి పర్సు, మొబైల్ ఫోన్ ఇతర వస్తువులు లాక్కున్నారు. అతని దగ్గర ఉండే బాగు కూడ లాక్కున్నారు.  వారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేసిన జాయ్ పిళ్లై ని వెంబడించి దోచుకున్నారు. ఈ సంఘటనలో జాయ్ పిళ్లై కాలికి గాయాలయ్యాయి.   బైక్ మీద వచ్చి ఈ దోపిడీకి పాల్పడ్డారు. అద రోజు రాత్రి మరో ఇద్దరిని ఇదే విదంగా దారి కాచి దోచుకున్నారు. జాయ్ పిళ్లై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు జరిపారు.ఆ ప్రాంతంలో సిసి కెమెరాలు శోధించి దోపిడి దొంగల  ఆచూకి కనుగున్నారు.  నిందితులలో ఇద్దరిని థనివారం జఫ్రా బాద్ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు