మరో హత్రాస్ ఘటనే ఇది - పోలీసుల నిర్లక్ష్యం ఉందా ?

 ఉత్తర ప్రదేశ్ లో జరిగినటు వంటి హత్రాస్ ఘటన లాంటిదే ఇది. ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడి ఆమె నిరాకరించడంతో  చంపి మృత దేహాన్ని కాల్చేసే ప్రయత్నం చేసాడు. పోలీసులు సరైన రీతిలో స్పందించ లేదని మృుతురాలి తల్లి దండ్రులు ఆరోపణ.


అనంతపురం జిల్లా ధర్మవరం ఎస్‌బిఐ బ్యాంకులో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి  స్నేహలత (19)హత్య కేసు విషయంలో పోలీసుల  నిర్లక్ష్యం పై విమర్శలు వెల్లు వెత్తు తున్నాయి.  తమ కూతురు వేధింపులకు గురి  అవుతోందని స్నేహలత తల్లిదండ్రులు పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగ్గా స్పందించ లేదని వారి ఆరోపణ. రాజేష్ అనే యువకుడు వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అంతా విన్న పోలీసులు మీరు ఇళ్లు మారండంటూ ఉచిత సలహా ఇచ్చి పంపించారే కాని సరైన రీతిలో జోక్యం చేసుకోలేదని స్నేహలత తల్లి దండ్రులు ఆరోపించారు. స్నేహ లత హత్యకు గురైన రోజు కూడ పోలీసులు స్పందించక పోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం (23-12-2020) సాయంత్రం  6.30 గంట సమయంలో స్నేహ లత తండ్రికి ఫోన్ చేసి గంటలో ఇంటికి వస్తానని చెప్పింది. అయితే ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తల్లి దండ్రులు గాబరా పడి పోయి 7.30  సమయంలో  రాజేష్ అనే యువకుడి ఇంటికి వెళ్లి అతన్ని నిల దీసారు. ఆ సమయంలో రాజేశ్ ఇంట్లోనే  ఉన్నాడని అతని వెంట కార్తీక్  అనే మరో స్నేహితుడు కూడ ఉన్నాడని స్నేహలత తల్లి దండ్రులు చెప్పారు. 9.30 వరకు  కూతురు కోసం ఎదురు చూసి రాక పోవడంతో పోలీసు స్టేషన్  కు వెళ్ళి   ఫిర్యాదు చేశారు.

"మీ అమ్మాయి ఏమీ చిన్న పిల్ల కాదు కదా? వచ్చేస్తుందిలే. ఉదయం రండి. వెతుకుదాం'' అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. 

స్నేహలతను రాజేశ్  బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని బడన్నపల్లి పొదల వైపు తీసుక వెళ్లి అక్కడే గొంతు లుల నులిమి చంపేసాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే రాజేశ్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అని పోలీసులు విచారిస్తున్నారు. స్నేహలతను రాజేశ్ చాలా కాలంగా ఇష్ట పడ్డాడని వారిద్దరి మద్య జరిగిన ఫోన్ కాల్స్ హిస్టరి ఉందని పోలీసులు చెప్పారు. ఈ హత్యలో కీలకమైన మరో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హత్యలో రాజేష్‌కు సహకరించిన కార్తీక్ నుంచి నాలుగు సెల్ ఫోన్లు, అపాచి బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజేష్, కార్తీక్‌లను కలిపి పోలీసులు హత్యకు సంబంధించి లోతుగా విచారిస్తున్నారు. వారిపై 302, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్ పరామర్శ

స్నేహలత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. మృతదేహానికి నివాళులు అర్పించిన వాసిరెడ్డి పద్మ... బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు