పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం - ఆకాశాన్ని అంటిన ధరలు
దాయాది దేశం పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం అమాంతం పెరిగి పోవడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశంలో ఏనాడు లేని విధంగా ధరలు అమాంతం పెరిగి సామాన్యులు విల విల లాడి పోతున్నారు. కరోనాకు ముందే పాకిస్తాన్ లో ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. దానికి తోడు కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపి వేసింది. ప్రజల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లి పోగా మరో వైపు ధరల పెరుగు దలను నియంత్రించ లేక ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సతమతమవుతున్నాడు. ఎన్నికల సమయంలో నిత్యావసర ధరలు నియంత్రణ లోకి తెస్తానని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ విఫలం అయ్యారని దేశ ప్రజలు శాపనార్దాలు పెడుతున్నారు. కూరగాయల ధరలతో పాటు ఉప్పులు, పప్పులు, నిత్యావసరాలు బాగా పెరిగాయి. ఒక్క కోడి గుడ్డు ధర ప్రస్తుతం 30 రాపాయలు అంటే అక్కడి పరిస్తితి ఎట్లా ఉందో అర్దం చేసుకోవచ్చు. కిలో అల్లం ధర వెయ్యి రూపాయల పై మాటే. కిలో పంచదార వంద రూపాయలు. అయితే ఈ ధరలన్ని కరోనా మహమ్మారి సంక్షోభంలో పెరిగాయని విశ్లేశిస్తున్నారు. ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కేందుకు ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తున్నాడంటే పన్నులు పెంచుతున్నారు. దాంతో ప్రజల కొనుగోలు శక్తి బాగా క్షీణించి పోయింది. మరో వైపు బాంకుల నుండి పెద్ద ఎత్తున డిపాజిట్లు విత్ డ్రా చేస్తున్నారు. కరెన్సి సమస్య ఏర్పడడంతో కొత్త కరెన్సి ముద్రిస్తున్నారు. పాకిస్తాన్ లో ఎప్పటికి పరిస్థితులు చక్క దిద్దుకుంటాయనేది ప్రశ్నార్దకంగా మారింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box