ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ అయిరెడ్డి హరినాథ్ రెడ్డి ఓ అద్భుతమైన వైద్య ఉపకరణాన్ని ఆవిష్కరించారు. కరోనా పేషంట్లకు సురక్షితంగా చికిత్స చేసేందుకు కరోనా కణాల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ఉపకరణం ఉపయోగపడనుంది. పోర్టబుల్ ఐసోలేషన్ అనే పేరిటి ఆవిష్కరించిన ఈ ఉపకరణం పై పేటెంట్ హక్కులు కూడ పొందారు.
ఐక్యరాజ్య సమితిలోని ప్రముఖ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ( World Intellectual Property, Organization,United Nations ) లో ఈ ఆవిష్కరణ గురించి ప్రచురితమైంది.
గాలి ద్వారా వ్యాపించే కరోనా మహమ్మారి ప్రస్తుత సంక్షోభంలో వైద్యపరంగా భద్రతా సమస్యలను పరిష్కరించడానికి అట్లాగే నిర్బంధ ప్రాంతం నుంచి కలుషితమైన కణాలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఉపయోగపడే విధంగా ఆ పరికారాన్ని రూపొందించినట్లు డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. దీనితో ఐసోలేషన్ గదులను నిర్మించడానికి అధిక మౌలిక సదుపాయాల వ్యయాన్ని అధిగమించి తక్కవ ఖర్చుతోనే పయోగించుకునే విధంగారూప కల్పన చేసారు.
బెంగుళూరుకు చెందిన డాక్టర్ రీబా కోరాతో కలిసి సంయుక్త పరిశోధనలో ఆవిష్కిరంచిన ఈ ఉపకరణాన్ని అతినీల లోహిత క్రిమిసంహారక పోర్టటబుల్ ఐసోలేషన్ ఉపకరణంగా నామకరణం చేశారు.
ప్రస్తుతం బెంగుళూరులోని అలయన్స్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ హరినాథ్ పనిచేస్తున్నాడు.
ఈ ఆవిష్కరణలో రెండు గదులను కలిగి ఉన్న పోర్టబుల్ అతినీలలోహిత క్రిమిసంహారక
ప్రతికూల పీడన ఐసోలేషన్ ఉపకరణం ( యుడిఎన్‌పీఏ అనే బడే వెంటిలేటర్ ) ను అభివృద్ది చేశామని
డాక్టర్ హరినాథ్ వెల్లడించారు. కరోనా రోగి బాహ్యంగా చికిత్స పొందుతున్నప్పుడు ఉపకరణం రెండవ గది...మొదటి గది
నుంచి వైరస్‌ను తీసివేసి వెంటనే చంపివేస్తుందని హరినాథ్ రెడ్డి వివరించారు. అంటే కరోనా రోగికి వైద్యం
అందించే వైద్యుడు రోగిని తాకకుండా అతను విడుదల చేసే వైరస్‌తో కూడిన గాలి వ్యాప్తి చెందకుండా...
వైద్యుడు పీల్చకుండా ఉంటుంది...ఇది ఒక కరోనా రోగులకే కాకుండా స్వైన్ ప్లూ లాంటి వ్యాధులతోపాటు
ఎలాంటి అంటురోగాలకైనా ఈ పరికరం ఉపయోగపడుతుందని డాక్టర్ హరినాథ్ వివరించారు. ఈ
ఉపకరణాన్ని ఉపయోగిస్తే వైద్యుడు గ్లౌస్ ఉపయోగించి రోగిని తాకి వైద్యం అందించవచ్చని తెలిపారు.
ఐసోలేషన్ ఉపకరణం ప్రయోజనాలు :
రోగుల యొక్క శీఘ్ర బదిలీ మరియు వేగవంతమైన క్రిమిసంహారక ప్రక్రియ కూడా ఉంటుందని హరినాథ్
రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఇది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు
ఉపయోగపడుతుందని అన్నారు. యుపిఎన్‌పీఏ స్థానికంగా లభించే అతి నీలలోహిత కాంతిని
ఉపయోగిస్తుందన్నారు.ఈ ఆవిష్కరణ వాణిజ్యపరంగా కనీస టర్న్‌రౌండ్ సమయంలో ఉత్పత్తి
చేయబడుతుందని...పూర్తిస్థాయిలో ఐసోలేషన్ వార్డు కంటే చాలా తక్కువ ఖర్చుతో దేశవ్యాప్తంగా
ఆసుపత్రులలో ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. పోర్టబుల్ ఐసోలేషన్ ఉపకరనం మంచి
నాణ్యమైనదని దీనిని తిరిగి ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. ఆపరేట్ చేయడానికి సులభంగా నిర్వహించడానికి ఎటువంటి నైపుణ్యం అవసరం లేదన్నారు.
డాక్టర్ హరి నాధ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సంస్థ నుండి ఇటీవల పరిశోధనా ప్రాజెక్టును స్వంతం చేసుకున్నారు.
: డాక్టర్ హరినాథ్ రెడ్డి.....9475175218
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box