ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు గుర్తించాలని సిఎస్ కు ఆదేశం
ఉపాధ్యాయ, పోలీస్ తో పాటు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారి చేయాలని ఆదేశం
డిల్లీ టూర్ ముగించి హైదరాబాద్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుద్యోగులకు ఖుషి ఖబర్ వినిపించారు. వివిద ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
‘‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box