పెరియార్ స్ఫూర్తితో పోరాడాలి - బి.సి. స్టడీ ఫోరం ఛైర్మన్ సాయిని నరేందర్



నూతన యుగం ప్రవక్త, ఆగ్నేయాసియా దేశాల సోక్రటీస్, సంఘ సంస్కరణోద్యమానికి తండ్రి, అజ్ఞానానికి, మూఢనమ్మకాలకి, ఆధారంలేని ఆచారాలకు బద్ధ శత్రువు." అని ఐక్యరాజ్యసమితి (యూనెస్కో) నుండి ప్రశంసలు పొందిన పెరియార్ ను ఆదర్శంగా తీసుకొని సామాజిక ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు పోరాటం చేయాలని మహాత్మ జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత, బి.సి స్టడీ ఫోరం వ్యవస్థాపక ఛైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. గురువారం వరంగల్ అర్బన్ జిలా హన్మకొండ అంబేడ్కర్ సెంటర్ లో తెలంగాణ బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాసమల్ల లక్షన్ అధ్యక్షతన జరిగిన  పెరియార్ ఈ.వి. రామసామి 47 వ వర్దంతి కార్యక్రమానికి నరేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

   పీడిత వర్గాల విముక్తికోసం, సామాజికన్యాయం కోసం నాస్తికత్వాన్ని ఆయుధంగా చేసుకొని బహుజన రాజ్య నిర్మాణంలో కీలక పాత్ర వహించిన బహుజన దిక్సూచి ఆధునిక విప్లవవాది   పెరియార్ 94 సంవత్సరాలు జీవించి ఎన్నో పోరాటాల ద్వారా ప్రజలకు చాలా హక్కులు కల్పించారని అన్నారు. బ్రిటీష్ పాలనలో దుర్మార్గాలను ప్రశ్నిస్తూ రాజ్యం నశించాలని వ్యాసం వ్రాసిన దీశాలని, దేశానికి స్వాతంత్రం వచ్చి దేశ ప్రజలకు వెండి సంకేళ్లు పోయి బంగారు సంకెళ్లు పడ్డాయని. రాజ్యాంగం వ్రాసుకున్న ఆ రాజ్యాంగం వల్ల మెజార్టీ ప్రజలకు ఒరిగేది ఏమిలేదని రాజ్యాంగ ప్రతులను కాలబెట్టి నిరసన వ్యక్తం చేసిన పెరియార్ నేటి తరం ఉద్యమకారులకు ఆదర్శం కావాలని అన్నారు. తన పోరాటం వల్ల బహుజన రిజర్వేషన్ల కోసం తొలి రాజ్యాంగ సవరణ చేపించారని, పెరియార్ కృషి పలితంగా 1967 లో తమిళనాడులో బహుజన రాజ్యం ఏర్పడిందని, స్వాభిమాన పెళ్లి చట్టం అమలు జరిగిందని తెలిపారు. 

   కేరళలో వైకోమ్ దేవాలయం ముందు నుండి దళితులు నడవరాదన్న దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడి దళితులకు గుడి ముందు నుండి నడిచే హక్కు కల్పించి తొలి మానవ హక్కుల పోరాటంలో విజయం సాధించారని అన్నారు. పెరియార్ సాంస్కృతిక విప్లవం, సామాజిక సందేశం దక్షిణాది తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ జాతీయులందరిని ప్రభావితం చేసిందని, ఆయన మాటలు, రాతలూ అక్షరాల్లో ముద్రించగలుగుతే కనీసం 50 పెద్ద సంపుటాలవుతాయని, కేవలం "అంటరానితనం-కులం" అన్న అంశం పైననే ఇప్పటికి తమిళంలో 20 సంపుటాలు వెలువడ్డాయని, స్త్రీ బానిస ఎందుకైంది తెలుగుతో పాటు ఫ్రెంచి భాషలో వెలువడిందని తెలిపారు. ఒక జాతి, ఒక వర్గ ప్రజలు వెనుకబడడానికి ఇతురుల అణచివేతతో పాటు ఆ జాతి ప్రజల్లో ఉన్న బానిసత్వం కూడా కారణమవుతుందని బోధించిన పెరియార్  బహుజన ప్రజల చైతన్య కోసం త్యాగపూరిత ఉద్యమాలు చేశారని తెలిపారు. 

     ఈ కార్యక్రమంలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, అసంఘటిత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నలిగింటి  చంద్రమౌళి, కొత్తూర్ జాక్ చైర్మన్ క్రాంతి, సైంటిఫిక్ స్థూడెంట్ ఫెడరేషన్ రాష్ట నాయకులు పెండ్యాల సుమన్, వివిధ సంఘాల నాయకులు కార్తీక్, గౌరీ శంకర్, యాకుబ్ పాషా,  భిక్షపతి, ఆంజనేయులు, లింగమూర్తి, జెట్టి స్వామి, ప్రమోద్, అబ్బారబోయిన రాజన్న,  సత్యనారాయణ, సముద్రాల శ్రీనివాస్, పరకాల కుమారస్వామి,    న్యాయవాదులు వేణు, నంద కిషోర్, రాచకొండ ప్రవీణ్ కుమార్, చింత నిఖిల్ కుమార్, రఫీక్ తదితరులు పాల్గొని పెరియార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రసంగించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు