యాదాద్రి తిరుగు ప్రయాణంలో కోతులకు అరటి పండ్లు తినిపిస్తున్న సిఎం కెసిఆర్
యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామి ఆలయాన్ని ఆదివారం సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కోతులకు అరటి పండ్లు తినిపంచారు. యాదాద్రి ఆలయం సందర్శన అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో మార్గా మద్యంలో ఆయనకు కోతులు తారసపడ్డాయి. కారు ఆపి దిగి కారులో ఉన్న అరటి పండ్లను కోతులకు తినిపించారు. ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటి సిబ్బంది కెసిఆర్ కు సహాయం చేశారు. యాదాద్రికి భక్తుల రాక తక్కువ కావడంతో యాదాద్రి చుట్టుపక్కల ఉన్న కోతులకు ఆహారం లేక ఆగం అవుతున్నాయని ఇది గ్రహించిన ముఖ్యమంత్రి కోతులకు ఆరటి పండ్లు తినిపించారని తెరాస శ్రేణులు తెగ సంబర పడి పోతున్నారు.
పూర్తి కావస్తున్న యాదాద్రి పనులు
యాదాద్రి ఆలయం పనులు పూర్తి కావస్తున్నాయి. పలు ఆలయ సముదాయాల నిర్మాణం తో పాటు రింగ్ రోడ్ పనులు పూర్తి అయ్యాయి. విగ్రహాల ఏర్పాటు కూడ పూర్తి కావచ్చింది. సిఎం కెసిఆర్ పనలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. బయట ముఖద్వారం నుండే సిఎం దర్శనం చేసుకున్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box