పట్టణాల నుండి పల్లెలకు పాకిన కరోనా గ్రామాల ప్రశాంతతను చెదర గొట్టింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ పంచాయితి పరిది లోని లక్ష్మిపురం గిరిజన గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకింది. ఇక ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంభందాలు తెగి పోయాయి. ఈ గ్రామమంలోకి సమీప గ్రామాలవారు ఎవరూ రావడం లేదు. ఈ గ్రామస్తులను ఇతర గ్రామాలకు ఎవరూ నానీయడం లేదు. బుధవారం గ్రేస్ హోం అనాధాశ్రమం నిర్వాహకులు, గ్రామ యువజన సంఘం అధ్వర్యంలో ఈ గ్రామాన్ని సందర్శించి నిత్యావసర సరకులు పంపణి చేసారు. గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులకు కరోనాసోకి గ్రామానికి ఎవరూ రావడం లేదని గ్రామస్థుల బాగోగులు ఎవరూ పట్టించు కోలేదని, గ్రామంలోనే స్థానికంగా దొరికే ఆహారాలతో జీవనం గడుపుతున్నారని తెల్సి గ్రామాన్నిసందర్శించామని గ్రేస్ హోం నిర్వాహకురాలు కారం రాధ తెలిపారు. తమతో పాటు పాత్రాపురం యువజన సంఘం సభ్యులు పలువురు గ్రామంలో కోవిడ్ పేషెంట్లకు బియ్యం, పప్పులు, పండ్లు కూరగాయలు పంపణి చేసారు. అట్లాగే గ్రామంలో ఇతర కుటుంబాలకు కూడ నిత్యావసర సరుకులు పంపిణి చేసినట్లు తెలిపారు.
ఈసందర్బంగా గ్రేసే హోం నిర్వాహకురాలు కారం రాధ మాట్లాడుతూ తమ వృద్ధాశ్రమం కోసం కొత్త గూడెం జిల్లా చంద్రు గొండకు చెందిన బిల్డర్ తిరుపతి రావు ఫేస్ బుక్ లో తన రిక్వెస్ట్ చూసి రూ 5వేల ఆర్థిక సహాయం చేశాడని ఆ డబ్బులతో కొండజాతి గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణి చేసామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు వాసం సరోజిని, కారం రాజు, వాసం సమ్మయ్య, వెంకట్, చందు నవీన్, సంతోష్ రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box