పేద విద్యార్థులకు మొబైల్ ఫోన్లు సహాయం చేసిన పూర్వ విద్యాార్థులు - ఓ ఉపాధ్యాయుడి ఆలోచనకు కార్యరూపం

 జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మొబైల్ ఫోన్ల పంపిణి
దాతలను అభినందించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హన్మంతు

 




వరంగల్ నగరంలోని  కాశిబుగ్గ     నరేంద్ర నగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు నేర్చుకునేందుకు  దాతలు ఒసంగిన మొబైల్ ఫోన్లను మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హన్మంతు తన కార్యాలయంలో పంపిణి చేశారు. పదవ తరగతి చదువుతున్న చిప్ప నాగమణి, సౌమ్య, అనూష, పవన్ కళ్యాన్ ,పూజిత అనే విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా మొబైల్ ఫోన్లు అందచేశారు.

ఆన్ లైన్ పాఠాల భోదన నేపద్యంలో మొబైల్ ఫోన్ల ప్రాధాన్యత బాగా పెరిగింది. కరోనా మహమ్మారి తెచ్చిన తంటాలతో పేద విద్యార్థులు ఆన్ లైన్ భోదనా పద్దతులకు అలవాటు కావడం అనివార్యంగా మారింది. 

ఈ పరిస్థితులలో పేద విద్యార్థులు మొబైల్ ఫోన్లు సమకూర్చు కునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు అర్దం చేసుకున్న పాఠశాల తెలుగు భాషోపాధ్యాయులు వాడపల్లి అజయ్ బాబు మొబైల్ ఫోన్లు సమకూర్చేందుకు తాను గతంలో పనిచేసిన ఓ ప్రైవేట్ పాఠశాళ పూర్వపు విద్యార్థులను సంప్రదించాడు.  1994 విద్యార్థి కృష్ణ చైతన్య ప్రస్తుతం ఎయిర్ టెల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అతనితో పాటుగా 1995 బ్యాచి పూర్వ విద్యార్థిణి దొనగరి మంజు (ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్నారు)  ఫోన్లు సమకూర్చారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంది హన్మంతు మాట్లాడుతూ  మొబైల్ ఫోన్ల దాతలను  అభినందించారు. కోవిడ్ 19 విసిరిన సవాళ్ళను అధిగమించి ఆన్ లైన్ డిజిటల్ పాఠాలు నేర్చుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు ఉద్భోదించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కోరారు.

విద్యార్థుల అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఇచ్చిన దాతలను జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి అభినందించారు. 

ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాల భోదన వినియోగించుకోవడంలో గుడి బడి విద్యార్థులు ముందున్నారని ఉపాధ్యాయులు తమ నిరంతర కార్యదీక్షతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు  రవి కుమార్ తెలిపారు. 

పరీక్షల నియంత్రణ జిల్లా అధికారి రమేశ్ బాబు,  సీనియర్ ఉపాధ్యాయులు కుమారస్వామి, అజయ్ బాబు,నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు