చావు బతుకుల మద్య చికిత్స పొందుతున్న చిన్నారిని ఆదుకున్న వరంగల్ ఎన్ఆర్ లు

 చేనేత కార్మికుడి నాలుగేళ్ల కూతురు వైద్య ఖర్చుల కోసం రూ 40 వేల ఆర్థిక సహాయం చేసిన వరంగల్ కు చెందిన లండన్ -యుకె  ఎన్ఆర్ ఐలు




డెంగ్యూ పాజిటివ్ తో ఆసుపత్రిలో  ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ళ చిన్నారికి వరంగల్ ఎన్ ఆర్ ఫోరం లండన్ - యుకె సభ్యులు వైద్యం కోసం సకాలంలో ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు.  జనగామ జిల్లా కంద్రానికి చెందిన  వీవర్స్ కాలనీకి చెందిన భోగ సిద్ధేశ్వర్ అనే చేనేత కార్మికుడి కూతురు నాలుగు సంవత్సరాల వయస్సు గల చిన్నారి భద్రావతి డెంగ్యూ సోకి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. కరోనా మహమ్మారి కారణంగా  పనులు లేక తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికుడు సిద్ధేశ్వర్  కూతురు వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించ లేని స్థితిలో వరంగల్ ఎన్ ఆర్ఐ లండన్ -యుకె ఫోరం అధ్యక్షులు శ్రీధర్ నీలను,ఫౌండర్ పసునూరి కిరణ్ లను ఫోన్ లో సంప్రదించి తన భాదను చెప్పుకున్నాడు. తన కూతురు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. సిద్ధేశ్వర్ విజ్ఞప్తికి స్పందించిన  శ్రీధర్ నీల లండన్ లో ఉండే వరంగల్ ఎన్ఆర్ ఐల తో మాట్లాడి రూ. 40 వేలు పోగు చేసి చిన్నారి వైద్య ఖర్చుల కోసం పంపించాడు. వైద్యం కోసం డబ్బులు అందడంతో తన కూతురుకు సకాలంలో వైద్యం చేయించ గలిగానని ప్రస్తుతం ఆరోగ్యం మెరుగైందని సిద్ధేశ్వర్ తెలిపాడు. లండన్ లో ఉన్న ఎన్ ఆర్ ఐలు దేవుడి లెక్క సహాయం చేసి ఆదుకున్నారని ఎన్ఆర్ ఐ ఫోరం అధ్యక్షులు శ్రీధర్ నీల ఫోరం ఫౌండర్ పసునూరి కిరణ్, వైస్ ప్రెసిడెంట్ జయంత్ వర్ది రాజు, జనరల్ సెక్రెటరి భాస్కర్ పిట్టల, భాస్కర్ మాడిశెట్టి తదితరులందరికి సిద్ధేశ్వర్ ఆయన భార్య గీత కృతజ్ఞతలు తెలియ చేసారు. ప్రాణ దాతలకు పాదాభివందనాలంటూ సిద్ధేశ్వర్ ఎన్ ఐర్ ఐలకు తన వీడియో సందేశం పంపించి కృతజ్ఞతలు చాటుకున్నాడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు