మాస్క్ లేకుంటే.. షాప్ సీజ్... మానుకోట కలెక్టర్ గౌతమ్ సీరియస్..
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఖచ్చితంగా మాస్క్ దరించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ పట్టించుకోని వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని మానుకోట కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.. మానుకోటలో మాస్కు ధరించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న షాప్ ను కలెక్టర్ సీజ్ చేసారు.
మానుకోట పట్టణంలో పర్యటిస్తున్న సందర్భంలో.. నెహ్రూసెంటర్లోని ఓ..స్వీట్ షాప్ లో మాస్క్ ధరించకుండా వ్యాపారం చేయడాన్ని గమనించి కలెక్టర్ గౌతమ్ నేరుగా షాప్ లోకి వెళ్ళారు..మాస్క్ లేకుండా వ్యాపారం.. క్షమించరాని నేరం అంటూ ఆగ్రహించి.. తక్షణం షాప్ సీజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించి షాప్ సీజ్ చేయించారు..నేరుగా కలెక్టర్ వచ్చి షాప్ సీజ్ చేయించడంతో ఒక్కసారిగా పట్టణంలోని వ్యాపారులు ఉలిక్కిపడ్డారు.. మాస్క్ ను వారు ధరించడంతోపాటు.. వినియోగదారులు కూడా ధరించాలంటూ చెప్పడం పలు దుకాణాల వద్ద కనిపించింది..
కలెక్టర్ గౌతమ్ వెంట మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box