ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఎమ్మెల్యే సీతక్కను అరెస్ట్ చేసిన పోలీసులు
కెసిఆర్పాలనలో పూర్తిగా పోలీసుల జులుం కొనసాగుతోంది. ప్రజాస్వామిక సూత్రాలను తుంగలో తొక్కి అడిగిని వారినందరిని అణగదొక్కే చర్యలకు పూనుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
భారి వర్షాలకు పంటలు నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వ నిర్లక్షాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రేైస్ పార్టి ఎమ్మెల్యే సీతక్కను ఆమెతో పాటు పార్టి కిసాన్ సెల్ నేతలను పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేసారు. వారిని అక్కడి నుండి బలవంతంగా లాక్కెల్లి వాహనాలలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీతక్కను మహిళా పోలీసులు చేయిపట్టుకుని బలవంతంగా వాహనం వద్దకు ఈడ్చుకు వెళ్లారు. తన పై చేయి వేయవద్దంటూ సీతక్క మహిళా పోలీస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కొద్ది సేపు మహళా పోలీసులకు సీతక్కకు మద్య తోపులాట జరిగింది.
పోలీసులు ప్రవర్తనపై సీతక్క తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసారు. అసెంబ్లీలో రైతుల సమస్యలు చర్చకు రానీయకుండా అసెంబ్లీ వాయిదా వేశారని సీతక్క విమర్శించారు. భారి వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్ట పోయినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని అన్నారు. రైతులకు వెంటనే పంట నష్ట పరిహారం చెలలించాలాని డిమాండ్ చేసారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని సీతక్క స్పష్టం చేసారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box