కరోనా చికిత్స పొందుతూ మృతి చెందిన ఉత్తర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి కమలా రాణి వరున్





ఉత్తర ప్రదేశ్ రాష్ర్ట మంత్రి కమలా  రాణి వరున్ (62) కరోనా వ్యాధి సోకి చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.  యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంలో  కమలా రాణి వరున్  సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందున్నారు. ఈ క్రమంలోనే జులై 18న అనారోగ్యం పాలయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.  లక్నోలో పిజిఐ ఆసుపత్రిలో మొదట ఆమెకు చికిత్స జరిగింది. ఆతర్వాత శ్యాం ప్రసాధ్ ముఖర్జి ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు.  ఆమెకోలుకోక పోవడంతో  అక్కడి నుండి సంజయ్ గాంధి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్పించి చికిత్స చేసారు.

ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. మంత్రి మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోది, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి ఆదివారం రామాలయం నిర్మాణం పనులు ప్రారంభం కానున్న అయోధ్యను సందర్శించాల్సి  ఉండగా అన్ని  కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.
మే నెల 3 1958 లో జన్మించిన   కమలా రాణి వరున్ కాన్పూర్ జిల్లా లోని ఘటన్ పూర్ అసెంబ్లి నియోజక వర్గం నుండి 2017 లో  గెలిచారు. అంతకు ముందు ఆమె చిన్నవయసులో  1996 లో మొదటి సారిగా పార్లమెంట్ కు ఎ్ననికయ్యారు. ఆతర్వాత 1998 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి రెండో సారి కూడ గెలిచారు. యోగి ఆదిత్యనాధ్ మంత్రి వర్గంలో కమలా రాణి ఏకైక మహిళా మంత్రి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు