చైనాకు చెందిన 52 మొబైల్ అప్లికేష‌న్ల పై నిషేధం ?

జూమ్ యాప్ సహా చైనాకు చెందిన 52 మొబైల్ అప్లికేష‌న్లు ప్రమాద కరం
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక
యాప్ లపై నిషేధం విధించే ఆలోచనలో కేంద్రం

భద్రతాకారణాల దృష్ట్యా చైనాకు చెందిన  52 మొబైల్ అప్లికేషన్స్ నిషేదానికి గురి కాబోతున్నాయా ?..కేంద్ర నిఘా వర్గాలు ఏం చెప్పాయి..జూమ్ కాలింగ్ ఆప్ సహా ఇతర ఆప్ లలో బారత పైరుల చేటా చౌర్యం జరుగుతోందా  ? ఈ విషయాలపై పరికొద్ది రోజుల్లో క్లారిటి రానుంది. చైనా దేశంతో సంభందాలుకలిగిన మొత్తం 52 ఆప్స్ నిషేదించాలని  కేంద్ర నిఘా వర్గాలు  సిఫార్సు చేసాయి.జూమ్,టిక్‌టాక్,యూసీ బ్రౌజ‌ర్,జెండ‌ర్,షేర్ఇట్,క్లీన్ మాస్టర్ తదితరఆప్స్ వల్ల దేశ భద్రతకు ముప్పు పొంది ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానంగా భద్రతా పర మైన కీలక శాఖలకు సంభందించిన  కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎవరూ ఈ ఆప్స్ ఉపయోగించరాదని నిఘా వర్గాలు తేల్చి చెప్పాయి.చైనా దేసంతో సంభందికలిగిన మొబైల్ సాఫ్ట్ వేర్ అఫ్లికేషన్స్ పై నిఘా వర్గాలు అధ్యయనం చేసిన అనంతరం జాతీయ భద్రతా మండలికి ఓ నివేదిక సమర్పించింది.ఇండియాలో అత్యధికంగా వినియోగిస్తున్న వీడియో కాలింగ్ జూమ్ ఆప్ ఏ మాత్రం భద్రత కాదని కేంద్రం ఇప్పటికే హెచ్చరిక చేసింది.జూమ్ ఆప్ కు సంభందించి ఇండాయా తో సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికా లో జూమ్ ఆప్ కు బదులుగా ఇత సోషల్ నెట్ వర్కులు ఉపయోగించాలని సూచించారు. జర్మనీలో ఈ యాప్ పై నిషేదం ఉంది.మరి కొన్ని దేశాలు ఈ జూమ్ ఆప్ పై నిషేదం విధించ బోతున్నాయి.  కేంద్ర నిఘా వర్గాలు సూచించిన యాప్ లను ఇండియాలో నిషేదించే దిశగా చర్చలు సాగుతున్నాయి. దాంతో జూమ్ ఆప్ లో ఉన్న లోపాలను సరి చేసి సరి కొత్త ఫీచర్స్ తో యూజర్లకు కొత్త వెర్షన్లు అందు బాటులోకి తెచ్చారు. అయితే యూజర్ల నుండి రోజు రోజుకూ రెస్పాన్స్ తగ్గుతున్నట్లు సమాచారం.సో..ఇలాంటి యాప్ లకు గుడ్ బై చెప్పడం  చాలా ఉత్తమం.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు