కెటిఆర్ మంత్రి పదవి నుండి తప్పు కోవాలి...రేవంత్ రెడ్డి

జివో నెంబర్ 111 ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన ఫాం హౌజ్  నిర్మించుకున్న ముఖ్యమత్రి కెసిఆర్ కుమారుడు  కెటిఆర్   మంత్రి పదవి నుండి తప్పు కోవాలని కాంగ్రేస్ పార్టి ఎంపి రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.ఫాం హౌజ్ నిర్మాణం కోసం అనేక నిభందనలు ఉల్లంఘించారని వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాల్వను పూడ్చేసి, తన ఫాంహౌస్‌కు వెళ్లేందుకు వెడల్పాటి రోడ్డు వేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కెటిఆర్ నిభందనలు ఉల్లంఘించారని తాను చేసిన ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారి చేసిందని తెలిపారు. జివో నెంబర్ 111 ఉల్లంఘనలపై 8 మందితో నిజ నిర్దారణ కమిటి ఏర్పాటు చేశారని చెప్పారు.
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా జనవాడలో కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మాణం విషయం పై రేవంత్ రెడ్డి మంత్రి కెటిఆర్ పై గతంలో ఆరోపణలు చేశారు. డ్రోన్ కెమెరాతో ఫాం హౌజ్ చిత్రీకరించాడని రేవంత్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఆయన జైళుకు వెళ్ళాల్సి వచ్చింది.
జైళు నుండి బయటకు వచ్చిన అనంతరం రేవంత్ రెడ్డి తాను చేసిన ఆరోపణలపై వెనక్కితగ్గకుండా కెటిఆర్ ను వీడేది లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేేశారు.ఫాంహౌజ్ వ్యవహారంలో  మంత్రి కెటిఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం, హెచ్ఎండీఏ, పొల్యూష‌న్ బోర్డుల‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.

301, 302 సర్వే నెంబర్లలో కేటీఆర్ భార్యకు కూడ భూమి ఉందని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే వాటిని కూడా బయటపెడతానని తేల్చి చెప్పారు. అర్చనా వెంచర్స్‌కు కూడా అక్కడ భూమి ఉందని, అందులో కేటీఆర్‌కు వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లోనే ఆయన పేర్కొన్నారని వెల్లడించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు