ముంబై మాజి మాఫియా డాన్ పాకిస్తాన్ ఐఎస్ఐ ఆశ్రయంలో తల దాచుకున్న దావుద్ ఇబ్రహీం కరోనా వైరస్ తో మరణించాడని పాకిస్తాన్ కు చెందిన చెందిన న్యూస్ ఎక్స్ మీడియా సంస్థ శనివారం వార్త కథనం ప్రసారం చేసింది. ఇబ్రహిం మరణ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ముంబైలో 1993 లో వందలాది మంది ప్రాణాలను బలిగొన్న వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.గత 25 ఏళ్ల నుంచి ఇండియాలో అడుగు పెట్టకుండా కొద్ది రోజులు దుబాయ్ లో ఉండి ఆతర్వాత పాకిస్తాన్ పంచన చేరి ఐస్ఐ ఆశ్రయంలో ఉంటున్నాడు. అయితే దావూద్ ఇబ్రహీం కరోనాపాజిటివ్ వార్తలు భూటకమని అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం కొట్టి పారేసినట్లు ఒక వార్త సంస్థలో ప్రసారం అయింది. దావూద్ ఆయన భార్య పిల్లలకు ఎలాంటి కరోనా సోకలేదని వారంతా ఆసుపత్రిలో లేరని ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నట్లు వార్త సంస్థ తెలిపింది.
దావూద్ ఇబ్రహీం ఆయన భార్య మెహజబీన్ కరోనా భారిన పడి కరాచీ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆ మరుసటి రోజే ఇబ్రహీం మరణించాడని పాకిస్తాన్ టివి చానెల్ న్యూస్ ఎక్స్ ప్రసారం చేయడం చర్చ నీయాంశంగా మారింది. ఇబ్రహీం మరణ వార్తపై అధికారికంగా పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేయ లేదు. భారత నిఙా వర్గాలు కూడ మరణ వార్త పై ఎలాంటి ధృవీకరణ చేయలేదు.
గతంలో అనేక సార్లు దావూద్ ఇబ్రహీం మరణించాడని వార్తలు వచ్చాయి.ఆతర్వాత క్షేమంగా ఉన్నాడని ఫాలోఅప్ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కూడ పూర్తిగా నమ్మలేని అనిశ్పచితస్థితి నెల కొంది. అసలు దావూద్ అబ్రహీం మరణించాడా లేదా అనేది ధృవీకరణ జరగాల్సి ఉంది.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అంటే ఇండియన్స్ కు చాలా మంట. దావూద్ పేరెత్తితేనే ఇంయన్సు మండిపడతారు. నిజంగా దావూద్ మరమించి ఉంటే ఇంయన్స్ కు పెద్ద శుభవార్తే అవుతుంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box