Oppo Fitness Band |
ఒప్పో తన మొదటి ఫిట్ నెస్ బ్యాండ్ ను కూడా లాంచ్ చేసింది. ఈ బ్యాండ్ బ్లాక్, పింక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. దీని ధరను 199 యువాన్లుగా(సుమారు రూ.2,125) నిర్ణయించారు.
ఒప్పో బ్యాండ్ వెర్షన్ ను కూడా దీంతో పాటు లాంచ్ చేశారు. ఇది స్టెయిన్ లెస్ స్టీల్ బాడీ టీపీయూ ప్లస్ అలో బ్యాండ్ తో దీన్ని రూపొందించారు. బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఇది లాంచ్ అయింది. దీని ధర 249 యువాన్లుగా(సుమారు
రూ.2,660) ఉంది. ఇందులోనే ఈవా ఎవాంజెలియన్ థీమ్ లిమిటెడ్ ఎడిషన్ కూడా ఉంది. దీని ధరను 299 యువాన్లుగా(సుమారు రూ.3,190) నిర్ణయించారు.
ఇందులో 1.1 అంగుళాల అమోఎల్ఈడీ 2.5డీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 126x294 పిక్సెల్స్ గా ఉంది. 100 శాతం డీసీఐ-పీ3 వైడ్ కలర్ గాముట్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. దాదాపు 160 వాచ్
ఫేసెస్ ను మనం ఇందులో ఎంచుకోవచ్చు.
ఇందులో 100 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 14 రోజుల వరకు దీన్ని ఉపయోగించవచ్చు. పూర్తిగా చార్జ్ చేయటానికి 1.5 గంటల సమయం పడుతుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇందులో
ఉంది. ఆండ్రాయిడ్ 6.0 లేదా ఐవోఎస్ 10.0+ ఆపరేటింగ్ సిస్టంల పైబడిన వెర్షన్లు ఉండే స్మార్ట్ ఫోన్లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
అవుట్ డోర్ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, అవుట్ డోర్ వాకింగ్, ఇండోర్ సైక్లింగ్, ఫ్రీ ట్రైనింగ్, ఫ్యాట్ లాస్ రన్నింగ్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, రోయింగ్ మెషీన్, ఎల్లిప్టికల్ మెషీన్, వెయిట్ లిఫ్టింగ్ వంటి 12 స్పోర్ట్స్ మోడ్స్ ను
ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ కోసం ఎస్పీ02 సెన్సార్ ను కూడా ఇందులో అందించారు.
5ఏటీయం వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ను ఇందులో అందించారు. నీటిలో 50 మీటర్ల వరకు దీన్ని ఉంచవచ్చు. యాప్ నోటిఫికేషన్లు, అలారం, టైమర్, మ్యూజిక్ కంట్రోల్స్, వెదర్ యాప్, ఫైండ్ మై ఫోన్ వంటి యాప్ నోటిఫికేషన్లను
కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఎన్ఎఫ్ సీ ఫీచర్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box