|
Minister KTR file photo |
కాంగ్రేస్ పార్టి ఎంపి రేవంతర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కుమారుడు ఐ.టి, మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు ట్విట్టర్ లో స్పందించారు.ఒక కాంగేర్సా నేత తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ భూమి తనది కాదని గతంలోనే చెప్పానని అన్నారు.తనపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని న్యాయపరంగా ఎదుర్కుంటానని అన్ని అసత్య ఆరోపణలని రుజువు చేస్తానని ట్వీట్ చేసారు.జి.వో నోంబర్ 111 నిభంనలకు విరుద్దంగా ఫాం హౌజ్ నిర్మాణం జరిగిందని కాంగ్రేస్ పార్టి ఎంపి రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయగా కెటిఆర్ కు రాష్ర్ట ప్రభుత్వానికి జిహెచ్ఎం సి కి నోటీసులు జారి చేసింది.
ఈ నోటీసులు అందుకున్నా ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కెటిఆర్ మంత్రి పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేసారు.వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాల్వను పూడ్చేసి,తన ఫాంహౌస్‌కు వెళ్లేందుకు వెడల్పాటి రోడ్డు వేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box