విషాదం:ఎసిబి కి పట్టు బడిన షేక్ పేట తహశీల్ దార్ భర్త ఆత్మహత్య



ఓ భూ వివాదం కేసులో ఎసిబికి పట్టుబడిన షేక్ పేట తహశీల్ దార్ సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.గత కొద్ది రోజులుగా తీవ్ర మనస్థాపానికి లో  నైన అజయ్ కుమార్ బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో చిక్కడపల్లి లోని తన సోదరి ఇంట్లో ఐదంతస్తుల భవణం నుండి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
తలకు బలమైనగాయాలు కావడంతో అతన్ని యశోధ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాగా రక్త స్రావం అయి చనిపోయినట్లువైద్యుల ధృవీకిరంచారు.
బుధవారం అజయ్ కుమార్ ఎసిబి  అధికారుల విచారణకు హాజరు కావల్సి  ఉంది. ఆయన భార్యసుజాత జైళుకు వెళ్ళిన తర్వాత కుమారునితో కల్సి అజయ్ కుమార్ తన సోదరి  ఇంట్లో ఉంటున్నాడని భందవులు చెప్పారు. ఉదయం ఫోన్ మాట్లాడుకుంటా పై అంతస్తుకు వెళ్ళి అక్కడి నుండి కిందకు దూకాడని చెప్పారు.
బంజారాహిల్స్ లో కోట్ల రూపాయల విలువ చేసే భూ వివాదం కేసులో తహశీల్ దార్ సుజాత తో పాటు రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నాగార్జున రెడ్డి,బంజారాహిల్స్ పోలీస్ ఇన్స్ పెక్టర్ రవీంద్ర నాయక్ లు లంచాలు తీసుకుని ఎసిబికి రెడ్ హాండెడ్ గా పట్టు బడ్డారు.సుజాత ఇంట్లో 30 లక్షల నగదు లభించింది.ఈ విషయంలో ఎసిబి పోలీసులు సుజాత భర్త అజయ్ కుమార్ ను ప్రశ్నించారు.భూమి అమ్మగా వచ్చిన డబ్బులను వాటిని దాచిపెట్టామని అజయ్ కుమార్ ఎసిబి అధికారులకు చెప్పినా సరైన ఆధారాలు చూప లేక పోయారు. ఈ కేసులో సుజాతతో పాటు రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నాగార్జున రెడడి,ఇన్స్ పెక్టర్ రవీంద్ర నాయక్ లను అరెస్ట్ చేయగా 14 రోజుల పాటు వారిని రిమాండ్ చేసారు.ఎసిబికేసు నమోదు అయినప్పటి నుండి సుజాత భర్త అజయ్ కుమార్ తన భందువుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారని తెల్సింది.అన్యాయంగా తమను ఎసిబి కేసులో ఇరికించారని మనస్థాపం చెందినట్లు భందువులు తెలిపారు.ఎసిబి అధికారుల వేధింపు చర్యల తోనే ఆజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని భందువులు ఆరోపించారు.అజయ్ కుమార్ ఉస్మానియా వర్శిటి ఆర్ట్స్ కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫసర్ గా పనిచేస్తున్నాడు.మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సుజాతకు బెయిల్

బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ షేక్‌పేట ఎమ్మార్వోసుజాతకు రాష్ట్ర హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. భర్త అజయ్ అంతక్రియల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు