రియల్ మీ నుంచి టివి విడుదల కాబోతోంది. త్వరలో లాంచ్ చేయనున్న కొత్త టీవీ స్పెసిఫికేషన్లను, ఫీచర్లను టీజర్ ద్వారా వెల్లడించింది. రియల్ మీ తన టీవీని మే 25వ తేదీన లాంచ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్ ద్వారా ఈ టీవీకి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు, ధర మాత్రం ఇంకా తెలియరాలేదు.
రియల్ మీ టీవీ ఆడియో సామర్థ్యం, ప్రాసెసర్ కు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు టీవీకు సంబంధించి కొన్ని షాట్స్ ను కూడా చూపించింది. దీన్ని బట్టి చూస్తే టీవీ అంచులు ఎంతో సన్నగా ఉండనున్నాయి. దీని ద్వారా స్క్రీన్ మరింత పెద్దగా కనిపిస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం క్రోమ్ బూస్ట్ పిక్చర్ ప్రాసెసింగ్ ఫీచర్ ను కూడా ఇందులో అందించారు. దీని ద్వారా బ్రైట్ నెస్ 400 నిట్స్ వరకు ఉండనుంది.
ఇందులో 64 బిట్ మీడియాటెక్ ప్రాసెసర్ ను అందించనున్నారు. స్మార్ట్ టీవీల్లో ఎక్కువగా ఉపయోగించే ప్రాసెసర్ ఇదే. కార్టెక్స్ ఏ53 సీపీయూ, మాలి-470 జీపీ3 జీపీయూలు కూడా ఈ ప్రాసెసర్ లో ఉండనున్నాయి. ఇక ఆడియో విషయానికి వస్తే.. ఇందులో నాలుగు స్పీకర్ల సిస్టంను అందించనున్నారు. దీని అవుట్ పుట్ 24Wగా ఉండనుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా రియల్ మీ టీవీలో వాయిస్ కమాండ్ కు సంబంధించిన ఫీచర్ కూడా ఉన్నట్లు ఈ టీజర్ లో తెలిపారు. దాన్ని మే 20వ తేదీన వెల్లడించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మే 25వ తేదీ వరకు ఆగక తప్పదు.
అయితే ఈ టీవీ స్క్రీన్ సైజ్ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి దాకా వచ్చిన లీకుల ప్రకారం చూస్తే ఈ టీవీ సైజు 43 అంగుళాలుగా ఉండనుంది. ఇది 4కే టీవీ కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే తక్కువ ధరలో ఫుల్ హెచ్ డీ వేరియంట్ ను కూడా అందించనున్నారని ప్రచారం జరుగుతోంది. రియల్ మీ ఈ టీవీ ధరను కూడా షియోమీ ఎంఐ టీవీలకు పోటీగా ఉండే అవకాశం ఉంది. మనదేశంలో షియోమీ టీవీలకు మంచి ఆదరణ ఉంది. స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా రియల్ మీ షియోమీనే ప్రధాన పోటీదారుగా పరిగణిస్తోంది.

0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box