రైట్ రైట్..తెలంగాణ ఆర్టీసి బస్సులు

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. ప్రజారవాణా సేవలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్రం తాజా మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం నుంచి బస్సులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ వర్గాలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ సోమవారం ఆర్టీసీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం కేబినెట్‌కు నివేదిస్తారు.
బస్సులు నడిపేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుసమాచారం.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు