కరోనా విజృంభణ
నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా
లాక్‌డౌన్‌ను మే 31 వరకు
పొడిగించింది. ఈ మేరకు నాలుగో విడత లాక్‌డౌన్ మార్గదర్శకాలు తెలుపుతూ కేంద్ర హోం
మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలో నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకే
వదిలేసింది. దేశంలో చిక్కు కుపోయిన విదేశీయులు, ఇతర ప్రాంతాల్లో చిక్కు కుపోయిన వలస కార్మికులు,
యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరుల
తరలింపునకు అనుమతినిచ్చింది. అదే విధంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యక్తుల రాకపోకలు నిషేధిస్తూ... అవసరమైన
సేవలకు మాత్రం మినహాయింపునిచ్చింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box